సిరిసిల్లలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

KTR, KTR Latest News, Mango News, Minister KTR, Minister KTR Inaugurated Newly Renovated Zilla Parishad High School, Newly Renovated Zilla Parishad High School, Newly Renovated Zilla Parishad High School at Sircilla, Sircilla, Sircilla Latest News, Sircilla News, Sircilla Zilla Parishad High School, Sircilla Zilla Parishad High School Inauguration, Zilla Parishad High School at Sircilla

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతా నగర్ లో సకల వసతులతో పునరుద్ధరించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ సోమవారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. రూ.3 కోట్లతో అభివృద్ధి చేసిన ఈ పాఠశాలలో 1000 మంది విద్యార్థులకు సరిపడేలా 33 తరగతి గదులను నిర్మించారు. డైనింగ్‌ హాల్‌, వాలీబాల్‌, ఫుట్‌బాల్‌ కోర్టులు, సీసీ కెమెరాలు, అత్యాధునికమైన గ్రంథాలయం, మోడ్రన్‌ టాయిలెట్స్‌, సురక్షిత తాగునీరు, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్‌ ల్యాబ్, సీసీ కెమెరాలు వంటి అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, 1960లో ప్రారంభమైన ఈ పాఠశాల‌ ఎంతోమందిని విద్యావంతులుగా మార్చి ఈ సమాజానికి ఉపయోగపడేలా దోహదం చేసిందన్నారు. గివ్‌ తెలంగాణ స్వచ్ఛంద సంస్థతో కలిసి కరోనా సమయంలో ఈ పాఠశాలలో అన్ని వసతులతో పునరుద్ధరణ కార్యక్రమాలు జరిగాయన్నారు. ఏ కార్పొరేట్ పాఠశాలకు కూడా తీసిపోని విధంగా ఈ పాఠశాల మారిందని, దీంతో విద్యార్థులు, టీచర్ల మీద కూడా ఎంతో బాధ్యత పెరిగిందన్నారు. ఇక రాష్ట్రంలో సంక్షేమ పాఠశాలల విద్యార్థులకు జాతీయ స్థాయిలో ర్యాంకులు వస్తున్నాయ‌న్నారు. రాష్ట్రంలో 945 గురుకులాలు ఏర్పాటు చేశామ‌ని, సంవత్సరానికి ఒక్కో విద్యార్థి మీద రూ.1.25 లక్ష‌లు ఖ‌ర్చుచేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ