కేంద్ర బడ్జెట్ 2021-22 ముఖ్యాంశాలు

Union Budget - 2021-22 Live Updates

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 29న ప్రారంభమయిన సంగతి తెలిసిందే. కరోనాతో ఏర్పడిన పరిస్థితులు దృష్ట్యా దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా కేంద్ర బడ్జెట్ 2021-22 ను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ముందుగా సంప్రదాయాన్ని అనుసరించి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్, ఆర్థికశాఖ సీనియర్ అధికారులు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో ‌ సమావేశమయ్యారు.

తర్వాత పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమై బడ్జెట్ కు ఆమోదముద్ర వేశారు. అనంతరం లోక్‌సభలో ఉదయం 11 గంటలకు ఆర్థికశాఖ మంత్రిగా నిర్మలాసీతారామన్ మూడోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ ఈసారి డిజిటల్‌గా మారింది. సాంప్రదాయ బహీఖాతా రూపంలో కాకుండా ఈసారి టాబ్లెట్ ద్వారా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను పార్లమెంటుకు తీసుకొచ్చారు. కరోనా నేపథ్యంలో తొలిసారిగా పేపర్ లెస్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

 కేంద్ర బడ్జెట్ 2021-22 ముఖ్యాంశాలు :

  • పెట్రోల్‌పై లీటరుకు రూ.2.5, డీజిల్‌పై రూ.4 అగ్రి సెస్‌ కు ప్రభుత్వం ప్రతిపాదన.
  • బంగారం, వెండి, ముడి పామాయిల్, మద్యం ఉత్పత్తులు, ముడి సన్ ఫ్లవర్ ఆయిల్ పై కూడా అగ్రి ఇన్ఫ్రా సెస్ విధింపు.
  • ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన మరో సంవత్సరం పొడిగింపు, మార్చి 31, 2022 వరకు గృహాల కొనుగోలుపై రాయితీలు.
  • దేశంలో స్టార్టప్‌లకు ఇచ్చే మినహాయింపులు మరో ఏడాది పొడిగింపు.
  • నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ, లెహ్, లడఖ్‌ లలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు. 15 వేల పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు. ఆదివాసీ ప్రాంతాల్లో ఏకలవ్య స్కూల్స్. అలాగే 100 సైనిక్ స్కూల్స్ ఏర్పాటు.
  • ఆదాయపన్నుల చెల్లింపులో మార్పులేదు. గతంలో ఉన్న స్లాబులు కొనసాగింపు.
  • ట్యాక్స్‌ ఆడిటింగ్‌ లో ఎన్నారైలకు మినహాయింపు. ట్యాక్స్‌ ఆడిట్‌ పరిమితి రూ.10 కోట్లకు పెంచుతూ నిర్ణయం.
  • ఐటీ రిటర్న్ దాఖలు చేసేవారు 2014 లో 3.31 కోట్లు ఉండగా 2020లో 6.48 కోట్లకు పెరిగారు.
  • రెంటల్ హౌస్ ప్రాజెక్టులకు పన్ను మినహాయింపు.
  • 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు పెన్షన్, వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ రిటర్నులను దాఖలు చేయకుండా మినహాయింపు.
  • టీ కార్మికుల సంక్షేమం కోసం రూ.1,000 కోట్లు.
  • 69 కోట్ల మంది లబ్ధిదారులు లేదా 86% శాతం మందికి ఒక దేశం-ఒకరేషన్ కింద సేవలు.
  • రైతు క్రెడిట్ టార్గెట్ (రుణాల లక్ష్యం) రూ.16.5 లక్షల కోట్లు. దేశవ్యాప్తంగా ఐదు వ్యవసాయ హబ్స్ ఏర్పాటు.
  • 2021-22లోనే ఎల్‌ఐసీ ఐపీవో కూడా తీసుకొస్తాం.
  • బ్యాంకుల రీకాపిటలైజేషన్ కోసం రూ.20,000 కోట్లు కేటాయింపు.
  • ఫైనాన్సియల్ ప్రొడక్ట్స్ కి సంబంధించి ఇన్వెస్టర్ రక్షణ కోసం కొత్త ఇన్వెస్టర్ ఛార్టర్ ఏర్పాటు.
  • బీమా రంగంలో ఎఫ్‌డీఐలు 49 శాతం నుంచి 74 శాతానికి పెంపు.
  • పిపిఏ పద్ధతి ద్వారా రూ.2,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన 7 పోర్ట్ ప్రాజెక్టులు.
  • రైల్వేల కోసం రూ.1.1 లక్షల కోట్లు ఖర్చు.
  • రూ.18,000 కోట్లతో పబ్లిక్ బస్సు ట్రాన్స్ పోర్ట్ పథకం.
  • మరో కోటి మందికి ఉజ్వల పథకం. సిటీ గ్యాస్ పంపిణీ కోసం రాబోయే 3 సంవత్సరాల్లో మరో 100 జిల్లాలను చేర్చుతాం.
  • జల జీవన్‌ మిషన్ ‌కు రూ.2,87,000 కోట్లు, రక్షిత మంచినీటి పథకాలకు రూ.87వేల కోట్లు.
  • 5 స్పెషల్ నేషనల్ హైవేల అభివృద్ధికి రూ.5 వేల కోట్లు కేటాయింపు.
  • 11వేల కి.మీతో నేషనల్ హైవే కారిడార్‌ నిర్మాణం.
  • ఖరగ్ పూర్-విజయవాడ మధ్య ఈస్ట్-కోస్ట్ సరకు రవాణా కారిడార్ ఏర్పాటు.
  • మార్చి 2022 నాటికి 8,500 కిలోమీటర్ల రహదారులను నిర్మించడం హైవే ఇన్‌ఫ్రా లక్ష్యం.
  • రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖకు రూ.1.18 లక్షల కోట్లు.
  • మొబైల్‌ ధరలు పెరుగుదల.
  • కొత్త కస్టమ్స్‌ పాలసీ అక్టోబర్ 2021 నుంచి ప్రారంభం.
  • ఫిట్‌నెస్ పరీక్ష ఆధారంగా స్వచ్ఛంద స్క్రాపింగ్ విధానం, వ్యక్తిగత వాహనాలకు 20 సంవత్సరాలు మరియు వాణిజ్య వాహనానికి 15 సంవత్సరాలు గడువు.
  • ఆటోమొబైల్‌ రంగం: కస్టమ్‌ డ్యూటీ పెంపు.
  • కొత్తగా 9 బీఎస్‌ఎల్‌-3 ప్రయోగశాలలు ఏర్పాటు.
  • 13 రంగాలకు సంబంధించిన పిఎల్‌ఐ పథకాలకు 1.97 లక్షల కోట్లు. మూడేళ్లలో మరో 7 టెక్స్ట్ టైల్ పార్కులు ప్రారంభం.
  • 5 సంవత్సరాలలో రూ.1.41 లక్షల కోట్ల వ్యయంతో అర్బన్ స్వచ్ఛ భారత్ 2.0 మిషన్ ప్రారంభిస్తాం.
  • కోవిడ్-19 వ్యాక్సిన్ల కోసం రూ.35,000 కోట్లు, మరో 100 దేశాలకు వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటన.
    ఆరోగ్య, సంరక్షణ రంగానికి 2,83,846 లక్షల కోట్లు.
  • ఆరు సంవత్సరాలలో రూ.64,180 కోట్ల వ్యయంతో ఆత్మనిర్భర్ హెల్త్ యోజన.
  • నేషనల్‌ డిసిజ్‌ కంట్రోల్‌ సిస్టం ఏర్పాటు, దేశ వ్యాప్తంగా 15 ఎమర్జెన్సీ సెంటర్లు.
  • 2021-22 బడ్జెట్‌ మూలధన వ్యయం రూ.5.54 లక్షల కోట్లు.
  • 2021-22 ద్రవ్యలోటు లక్ష్యం 6.8 శాతం.
  • 2020-21 ద్రవ్యలోటు 9.5 శాతం.
  • 2022లో అప్పుగా ప్రభుత్వానికి 12 లక్షల కోట్లు అవసరం.
  • 2021-22 బడ్జెట్ యొక్క ఆరు కీలక అంశాలు: ప్రజల ఆరోగ్యం మరియు సంరక్షణ, దేశంలో మౌలిక సదుపాయాలు, దేశ సమగ్ర అభివృద్ధి, మానవ మూలధన అభివృద్ధి, పరిశోధన మరియు అభివృద్ధి, మినిమమ్ గవర్నమెంట్-మాక్సిమమ్ గవర్నెన్స్.
  • కరోనా సమయంలో ప్రకటించిన పీఎం గరిబ్ కల్యాణ్ యోజన, మూడు ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలు వంటివి 3-4 చిన్న బడ్జెట్లగా దోహదపడ్డాయి.
  • కరోనా సమయంలో ప్రాణాలను ప్రాణంగా పెట్టి సేవలు అందించిన ఫ్రంట్‌లైన్ యోధులకు కృతజ్ఞతలు.
  • దేశాన్ని ప్రభావితం చేసిన విపత్తుల దృష్ట్యా ఇంతకు ముందెన్నడూ లేని పరిస్థితులలో ఈ బడ్జెట్ తయారీ జరిగింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =