రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫాక్స్‌కాన్ టెక్నాలజీస్ ప్లాంట్‌కు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కంపెనీ సీఈవో యాంగ్ లియూ, మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు పాల్గొన్నారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. భారత్‌లో తన ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ఫాక్స్‌కాన్ కంపెనీ తెలంగాణను ఎంచుకున్నందుకు సంతోషమని, ఒప్పందం కుదిరిన రెండున్నర నెలల్లోనే (మార్చి 2, 2023) శంకుస్థాపన చేసుకోవడం విశేషమని పేర్కొన్నారు. ఇంత తక్కువ కాలంలో కంపెనీ ఏర్పాటుకు చొరవ చూపిన అధికారులను మంత్రి అభినందించారు. ఏడాదిలోగా ప్లాంటు పూర్తికావాలని కోరుకుంటున్నామని, ఫాక్స్‌కాన్ తెలంగాణకు ఐకాన్‌గా నిలువనుందని చెప్పారు. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, భవిష్యత్‌లోనూ సంస్థతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు.
ఇక్కడ ఫాక్స్‌కాన్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం 196 ఎకరాల భూమిని కేటాయించిందని, మొత్తం రూ.1,656 (200 మిలియన్ డాలర్లు) కోట్ల పెట్టుబడి పెట్టనుందని తెలిపారు. ఇక ఈ ప్లాంట్ ద్వారా దాదాపు 35 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని, అందులో మొదటి దశలోనే 25 వేల వరకు ఉద్యోగాలు ఇవ్వనుందని ప్రకటించారు. కాగా పరిశ్రమల్లో పనిచేసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు త్వరలోనే యువత కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా 23 లక్షల ఉద్యోగాలు సృష్టించామని, ఈ క్రమంలో ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. గతేడాది దేశంలో కల్పించిన ప్రతి మూడు ఉద్యోగాల్లో ఒకటి రాష్ట్రంలోనే ఇచ్చామని, ఇది ఇలాగే కొనసాగితే రానున్న 10 ఏళ్లలో సుమారు 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.
కాగా ఫాక్స్‌కాన్ ప్రముఖంగా మొబైల్ ఫోన్లు మరియు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ సంస్థ. యాపిల్ ఐ ఫోన్‌లలో 70 శాతం ఫాక్స్‌కాన్‌చే తయారు చేయబడినవి. ఫాక్స్‌కాన్‌కు ఇప్పటికే యాపిల్ నుంచి భారీ ఆర్డర్ లభించినందున, వచ్చే ఏడాది చివరి నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆపిల్ కంపెనీ ఎయిర్‌పాడ్‌లు మరియు వైర్‌లెస్ ఇయర్ ఫోన్‌ల తయారీ ఆర్డర్‌ను ఫాక్స్‌కాన్‌కు అప్పగించింది. ఇప్పటి వరకు మొబైల్ ఫోన్ల తయారీకే ప్రాధాన్యతనిచ్చిన ఫాక్స్‌కాన్ ఇప్పుడు ఎయిర్‌పాడ్‌ల తయారీలోకి అడుగు పెడుతోంది. ఇటీవల ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లియూ నేతృత్వంలోని కంపెనీ ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్‌తో సమావేశమై తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటుపై చర్చించిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE