ఏప్రిల్ 25, శనివారం నాడు ప్రపంచ పశువైద్య దినోత్సవం సందర్బంగా పశు సంవర్ధక శాఖ ఉద్యోగులు, పశు వైద్యుల ఆధ్వర్యంలో ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని విద్యానగర్ లో గల రెడ్ క్రాస్ సంస్థ భవనంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి తలసాని మాట్లాడుతూ లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలోని బ్లడ్ బ్యాంక్ లలో రక్త నిల్వలు తగ్గిపోయాయని అన్నారు. తలసేమియా రోగులు, డయాలసిస్ రోగులకు ఈ రక్తం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. రక్తదానం చేసిన ఉద్యోగులు, సిబ్బందిని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. మరోవైపు రాష్ట్రంలో జీవాలకు వైద్యసేవలు అందించడంలో, పశుగ్రాసం కొరత నివారణలో పశుసంవర్ధక శాఖ ఎంతో సమర్ధవంతంగా పనిచేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu