తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై మంగళవారం కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాజ్యాంగం లోని ఆర్టికల్ 170 (3)కి లోబడి 2026 సంవత్సరం తర్వాత మొదటి సెన్సస్ జనాభా లెక్కలు ప్రచురించబడ్డాకే నియోజవర్గాల పునర్విభజన ఉంటుందని తెలిపారు. దీంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 2031 తర్వాత నియోజక వర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది. ముందుగా తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభలో ప్రశ్న అడిగారు. ఈ మేరకు కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. ఏపీ విభజన చట్టం ప్రకారం పునర్విభజన జరిగితే తెలంగాణలో అసెంబ్లీ నియోజక వర్గాలు 119 నుంచి 153కి, ఏపీలో ప్రస్తుతమున్న 175 నియోజకవర్గాల నుంచి 225 కు పెరగనున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ





































