గొల్లపల్లె గ్రామంలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ షర్మిల

Gollapalle, Mango News, Nirudyoga Nirahara Deeksha, Sircilla Dist, YS Sharmila Nirudyoga Nirahara Deeksha, YS Sharmila Nirudyoga Nirahara Deeksha at Gollapalle, YSRTP Chief YS Sharmila, YSRTP Chief YS Sharmila Conducting Nirudyoga Nirahara Deeksha, YSRTP Chief YS Sharmila Nirudyoga Nirahara Deeksha, YSRTP Chief YS Sharmila Nirudyoga Nirahara Deeksha at Gollapalle, YSRTP Chief YS Sharmila Nirudyoga Nirahara Deeksha at Gollapalle in Sircilla Dist

రాష్ట్రంలో నిరుద్యోగ స‌మ‌స్య‌పై పోరాటంలో భాగంగా ప్రతి మంగళవారం నిరుద్యోగవారంగా ప‌రిగ‌ణించి నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష చేపట్టాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్టు 3, మంగళవారం నాడు రాజ‌న్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ నియోజకవర్గం, కోనరావుపేట మండలం, గొల్లపల్లె గ్రామంలో నిరుద్యోగుల కోసం వైఎస్ షర్మిల నిరాహారదీక్ష చేపట్టారు. ముందుగా గొల్లపల్లె గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి మ‌హేంద‌ర్ యాద‌వ్ కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించారు. మ‌హేంద‌ర్ యాద‌వ్ కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం గొల్లపల్లె గ్రామంలో ఏర్పాటు చేసిన నిరుద్యోగ దీక్షాస్థలికి చేరుకుని నిరాహార దీక్షలో కూర్చొన్నారు.

గొల్లపల్లె గ్రామంలో వైఎస్ షర్మిల దీక్ష సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, నిరుద్యోగులు పాల్గొన్నారు. మరోవైపు ఇప్పటికే జూలై 13 వనపర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని తాడిప‌త్రి గ్రామంలో, జూలై 20న ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం, పెనుబల్లిలో, జూలై 27న నల్గొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గంలోని పుల్లెంల గ్రామంలో వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్షను చేపట్టారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − twelve =