నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీకి జరిగిన ఉపఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ను కవిత కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపొందిన కవితకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆమెను సీఎం కేసీఆర్ ఆశీర్వదించారు.
నిజామాబాద్ ఎమ్మెల్సీకి జరిగిన ఉపఎన్నికలో మొత్తం 823 ఓట్లు పోల్ అవగా, టిఆర్ఎస్ పార్టీ 728 ఓట్లు, బీజేపీ 56, కాంగ్రెస్ 29 ఓట్లు దక్కించుకున్నాయి. అలాగే 10 ఓట్లు చెల్లలేదని అధికారులు పేర్కొన్నారు. కల్వకుంట్ల కవిత భారీ మెజార్టీతో విజయం సాధించడంతో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్రమంత్రులు, నాయకులు కవితకు శుభాకాంక్షలు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu