మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ పక్రియ ప్రశాంతంగా ముగిసింది. మునుగోడు పోరులో మొత్తం 47 మంది బరిలో నిలిచినప్పటికీ, ముఖ్యంగా ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యే త్రిముఖ పోరు నెలకుంది. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మునుగోడు ఉపఎన్నికలో ఏ పార్టీ విజయం సాధించబోతుందో ప్రజల్లో ఆసక్తి నెలకుంది. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికకు సంబంధించి గురువారం సాయంత్రం ఆరు గంటల తర్వాత పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఎక్కువగా టీఆర్ఎస్ పార్టీవైపే మొగ్గుచూపాయి. అత్యధిక ఓటింగ్ శాతంతో టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని అంచనా వేశాయి. కాగా మునుగోడులో ఏ పార్టీ జెండా ఎగురవేయబోతుందో తెలియాలంటే నవంబర్ 6వ తేదీ వరకు వేచి చూడాల్సి ఉంది.
ఎగ్జిట్ పోల్స్ వివరాలు (ఓట్ల శాతం):
ఆత్మసాక్షి సర్వే:
- టీఆర్ఎస్: 41-42
- బీజేపీ: 35-36
- కాంగ్రెస్: 16.5-17.5
థర్డ్ విజన్ రీసెర్చ్-నాగన్న ఎగ్జిట్ పోల్ సర్వే:
- టీఆర్ఎస్: 48-51
- బీజేపీ: 31-35
- కాంగ్రెస్:13-15
నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ ఎగ్జిట్ పోల్ సర్వే:
- టీఆర్ఎస్: 42.11
- బీజేపీ: 35.17
- కాంగ్రెస్: 14.07
పల్స్ టుడే:
- టీఆర్ఎస్: 42-43
- బీజేపీ: 38.05
- కాంగ్రెస్: 14-16.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE