మునుగోడులో ముగిసిన ఉపఎన్నిక పోలింగ్ పక్రియ, నవంబర్ 6న ఫలితం

Munugode Bye-election Polling Completed Peacefully Counting on November 6th, Munugode Polling Completed, Munugode Election, Munugode Counting on November 6th,Mango News,Mango News Telugu, TRS Party Munugode By-Poll, Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ పక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి సమయం దాటినా కూడా ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇక ఉప ఎన్నికలో సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఉదయం కొంత మంద‌కొడిగా సాగిన పోలింగ్, మధ్యాహ్నం 3 గంటల త‌ర్వాత భారీగా పుంజుకుంది. కొన్ని కేంద్రాల్లో రాత్రి 8 గంటల వరకు పోలింగ్ కొనసాగే అవకాశం ఉండడంతో పూర్తి ఓటింగ్ శాతం ఇంకా తెలియాల్సి ఉంది. మునుగోడు ఉపఎన్నికలో భాగంగా అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

మునుగోడు పోరులో 47 మంది బరిలో నిలిచినప్పటికీ, ముఖ్యంగా ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్యే త్రిముఖ పోరు నెలకుంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి ఈ ఉపఎన్నికల్లో బరిలో నిలిచి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పోలింగ్ శాతం కూడా భారీగా నమోదు కావడంతో ప్రధాన పార్టీల నాయకులు తమకు అందిన నివేదికల ఆధారంగా వారి అభ్యర్థుల విజయావకాశాలపై విశ్లేషణ చేస్తున్నారు. కాగా ఇటీవల కాలంలో అత్యంత ఆసక్తి, ఉత్కంఠ రేపిన మునుగోడు ఉపఎన్నిక ఫలితం నవంబర్ 6, ఆదివారం నాడు వెలువడనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE