గందరగోళానికి తెరలేపిన బకెట్ గుర్తు

National Jana Sena headache for Jana Sena,National Jana Sena headache,headache for Jana Sena,Jana Sena headache,Mango News,Mango News Telugu,New Headache For Janasena,Jana Sena releases list of eight candidates,Pawan Kalyan, Janasena, Glass Symbol, BJP,Janasena, Telugudesam, Prem Kumar, Kukatpally,Jateeya Janasena,Bucket Symbol,TS Assembly Polls,Janasena In Kukatpally,Janasena Latest News,Janasena Latest Updates,Janasena Live News
Pawan Kalyan, Janasena, Glass Symbol, BJP,Janasena, Telugudesam, Prem Kumar, Kukatpally,Jateeya Janasena,Bucket Symbol,TS Assembly Polls

తెలంగాణ ఎన్నికలలో పోటీ చేస్తున్న జనసేనకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో  బీజేపీతో జనసేన  పొత్తు పెట్టుకోవడంతో..పొత్తులో భాగంగా  బీజీపీ ..  జనసేనకు  8 స్థానాలనుఅధిష్టానం కేటాయించింది. కూకట్‌పల్లి నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, తాండూరు నుంచి నేమూరి శంకర్ గౌడ్, కోదాడ నుంచి మేకల సతీష్ రెడ్డి , నాగర్‌కర్నూలు నుంచి వంగల లక్ష్మణ్ గౌడ్, ఖమ్మం నుంచి మిర్యాల రామకృష్ణ, కొత్తగూడెం నుంచి లక్కినేని సురేందర్ రావు, వైరా నుంచి తేజావత్ సంపత్ నాయక్, అశ్వారావు పేట నుంచి ముయబోయిన ఉమాదేవిని  జనసేన అభ్యర్థులుగా జనసేనాని పోటీలోకి దింపారు. దీంతో ఎవరికి వారే తమ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు.

పొత్తు కుదిరింది.. 8 స్థానాలు దక్కాయని జనసేన ఎన్నికలలో గెలుపు కోసం కసరత్తులు  చేస్తోంటే.. జాతీయ జనసేన అనే కొత్త  పార్టీ  జనసేనకు చెక్ పెట్టడానికి రెడీ అయింది. పార్టీ పేరే కాదు.. పార్టీ సింబల్ కూడా గాజు గ్లాసుకు దగ్గరగా ఉండటంతో జనసేనాని అయోమయంలో పడ్డారు. బకెట్ గుర్తుతో అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్న జాతీయ జనసేన పొలిటికల్ కుట్రతో.. తమ ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యి ఆ గుర్తుపై ఓటు వేస్తారనే భయం ఇప్పుడు పవన్‌ను, జనసేన అభ్యర్థులను వెంటాడుతోంది.

హైదరాబాద్‌లో కీలక నియోజకవర్గంగా అంతా చెప్పే కూకట్‌పల్లిలో  ‘జాతీయ జనసేన’ అభ్యర్థి నిలబడుతుడుతున్నారు. దీంతో  పవన్ కల్యాణ్‌కు ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడ్డారు. నిజానికి ఈ నియోజకవర్గంలో సెటిలర్లు ఎక్కువగా ఉండటంతో.. ఇప్పటి వరకూ జనసేన గెలుస్తుందని పార్టీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. అందుకే పదేపదే బీజేపీ నేతల నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా.. జనసేనాని కూటక్ పల్లి నియోజకవర్గంపై పట్టుపట్టడంతో..ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించారు కమలం పార్టీ పెద్దలు.

నిజానికి ఇక్కడ జనసేన అభ్యర్థిగా నిలబడ్డ  ప్రేమ్ కుమార్ కూడా టికెట్ కన్ఫామ్ అవకముందు నుంచి కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేపడుతూ వస్తున్నారు. దీంతో సెటిలర్ల ఓటర్లతో పాటు.. ఆ నియోజకవర్గంలో  ముమ్మారెడ్డి చేసిన సేవతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత జనసేనకు కలిసొస్తాయని ఆ పార్టీ గెలుపుతో భారీ లెక్కలే వేసుకుంది. దీనికి తోడు తెలంగాణలో  టీడీపీ  క్యాడర్‌ కూడామ తమ వెంటే ఉండటంతో కచ్చితంగా గెలుస్తాని ముమ్మారెడ్డి  ప్రేమ్ కుమార్ ధీమాగా ఉన్నారు. కానీ  ఆ ఆశలన్నీ ఆవిరి చేసే పార్టీ, పార్టీ సింబల్ జనసేన పార్టీని కలవరపెడుతున్నాయి.

నిజానికి ఎప్పటి నుంచో ఇండిపెండెంట్లక, చిన్న చిన్న పార్టీలకు  ఇచ్చే సింబల్స్‌తో పెద్ద పార్టీలకు చిక్కొచ్చి పడిన సందర్భాలు చాలా జరిగాయి.  2018 ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గంలో .. బీఆర్ఎస్ గుర్తు ‘కారు’ కాగా.. ఇండిపెండెంట్ అభ్యర్థి ‘రోడ్డు రోలర్’ గుర్తుతో బరిలో నిలబడటంతో.. ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యారు. దీంతో వేముల వీరేశానికి పడాల్సిన ఓట్లు రోడ్డు రోలర్ గుర్తుకు పడ్డాయి. అలా ఓట్లు చీలిపోవడంతో.. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య అవలీలగా విజయం సాధించారు.

తాజాగా 2023 ఎన్నికల్లో కారును పోలి ఉన్న గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టును బీఆర్ఎస్ అధిష్టానం సంప్రదించడంతో కొన్ని గుర్తులను నిలిపివేసింది. ఇప్పుడు జనసేనకు సింబల్ విషయంలో ఇలా జరుగుతుండంతో ఇది బీఆర్ఎస్ కుట్ర అని జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ దగ్గరకు వచ్చేసరికి ఒకలా.. వేరొకరికి ఇంకోలా ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE