బీజేపీ అభ్యర్థుల జాబితా వచ్చేది అప్పుడే..

Telangana BJP, Kishan Reddy, Lok sabha elections, Bandi sanjay, Minister for Finance and Health, TPCC, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Mango News, Mango News Telugu
Telangana BJP, Kishan Reddy, Lok sabha elections, Bandi sanjay

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో దేశం మొత్తం ఎన్నికల వాతావరణం కనపడుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలపై దృష్టిపెట్టేసాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అటు ప్రాంతీయ పార్టీలు మెజార్టీ స్థానాలు దక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇటు తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలయిపోయింది. తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో కనీసం పదికి పైగా స్థానాలను దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు కసరత్తు చేస్తున్నాయి.

ఇప్పటికే బీఆర్ఎస్ కదనరంగంలోకి దూకేసింది. పార్లమెంట్ నియోఖవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు కూడా నిర్వహించింది. రేపో, మాపో గులాబీ బాస్ కేసీఆర్ కదనరంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. అటు కాంగ్రెస్ కూడా ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. మెజార్టీ స్థానాలను దక్కించుకొని కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడానికి సహాయ పడాలని టి.కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు రేవంత్ రెడ్డి ఇవాళ ఇంద్రవల్లిలో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అటు కాంగ్రెస్ తరుపున బరిలోకి దిగేందుకు కూడా పెద్ద ఎత్తున ఆశావాహులు పోటీ పడుతున్నారు.

మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓటమిపాలయిన బీజేపీ.. లోక్ సభ స్థానాల్లో అయినా తమ హవా చాటాలని భావిస్తోంది. ఈ మేరకు టి.బీజేపీ నేతలు దూకుడుగా ముందుకెళ్తున్నారు. అటు అసెంబ్లీ ఎన్నికల్లో మహామహులంతా ఓటమి పాలు కావడంతో.. లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే బీజేపీ మొదటి అభ్యర్థుల జాబితా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైకమాండ్‌తో చర్చలు జరిపి మొదటి జాబితాను ఫైనల్ చేశారు.

మొదటి జాబితాలో 8 నుంచి 10 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అటు కరీంనగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ మరోసారి బరిలోకి దిగుతున్నారు. ఆయా స్థానాలతో పాటు మహబూబ్‌నగర్, భువనగిరి, చేవెళ్ల, హైదరాబాద్, మెదక్, జహీరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో ఆశావాహులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. ఆచుతూచి పరిశీలించి.. సామాజిక సమీకరణలను పరిశీలించి అభ్యర్థులను ఖరారు చేశారట. రెండు, మూడు రోజుల్లో బీజేపీ మొదటి అభ్యర్థుల జాబితా విడుదల కానున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =