SLBC టన్నెల్ వద్ద ఆపరేషన్ డీ అమలు

Operation D Implemented At SLBC Tunnel, Operation D, Operation D Implemented, Rat Holes Miners, SLBC Incident, SLBC Tunnel, Tunnel Operations, SLBC, Rescue Personnel, SLBC Tunnel Operations, SLBC, Telangana Tunnel Mishap, Telangana Tunnel Collapse, Hyderabad, Hyderabad Live Updates, Latest Hyderabad News, Telangana, TS Politics, TS Live Updates, Political News, Mango News, Mango News Telugu

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో గల్లంతయిన 8 మంది కోసం 14 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ రేయింబవళ్లు కష్టపడుతూనే ఉంది. ప్రతీ రోజూ వివిధ ప్రయత్నాలు చేస్తున్నా.. ఫలితం దక్కడం లేదు. దీంతో ఈరోజు రెస్క్యూ బృందాలు ‘ఆపరేషన్ డీ’ని అమలు చేస్తున్నాయి. కేరళకు చెందిన రెండు డాగ్ స్క్వాడ్ బృందాలు గురువారం నుంచి సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. దీనికితోడు మొన్నటి నుంచి కన్వేయర్ బెల్ట్ పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభించడంతో..మరింత వేగవంతమైన తవ్వకాలకు దోహదం చేస్తున్నట్లు అయింది.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద 14వ రోజు సహాయక చర్యల్లో భాగంగా రెస్క్యూ బృందాలు ఆపరేషన్ డీ అమలు చేస్తున్నాయి. గల్లంతయిన 8 మంది ఆచూకీ కోసం టన్నల్ లోపల కేరళకు చెందిన రెండు డాగ్ స్క్వాడ్ బృందాలు.. ఈరోజు నుంచి సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. మట్టిలో చిక్కుకున్న వారిని, బురదలో కూరుకుపోయిన మృతదేహాల.. వాసన పసికట్టి వారిని గుర్తుపట్టడంలో ఈ జాగిలాలు ప్రత్యేక శిక్షణ తీసుకున్నాయి.

ఆమధ్య కేరళ వాయినాడ్ వరదల సమయంలో చిక్కుకున్న వారితో పాటు..బురదలో కూరుకుపోయిన మృతదేహాలను పసిగట్టడంలో ఈ జాగిలాలు కీలక పాత్ర పోషించాయి ఈ క్యాడవర్ జాగిలాలకు 20 అడుగుల లోపల ఉన్న వ్యక్తులను, మృతదేహాలను కూడా గుర్తించడంలో ది బెస్ట్ట్ రికార్డ్స్ ఉన్నాయి. కన్వేయర్ బెల్ట్ మిషన్ కూడా ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో అందుబాలోకి రానుండంతో ఈ రోజు వారి ఆచూకి తప్పకుండా తెలుస్తుందన్న నమ్మకంతో అధికారులు ఉన్నారు.

ఈ ప్రమాదం ఎస్ఎల్బీసీ టన్నెల్ 14వ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. 13.5 కిలోమీటర్ వరకు కన్వేర్ బెల్ట్ సింగరేణి, జేపీ కంపెనీ ఇంజనీర్లు రీస్టార్ట్‌ చేశారు. కన్వేయర్‌ బెల్ట్‌ పూర్తి స్థాయిలో పనిచేయడంతో నేటి నుంచి మినీ ప్రోక్లైనర్‌తో మట్టి తవ్వకాలను జరపడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. 13 రోజులుగా మాన్యువల్‌గానే ఈ తవ్వకాలు చేపడుతున్నారు. జీపీఆర్ మిషన్ ఇచ్చిన డేటా ఆధారంగా ఈ తవ్వకాలను కొనసాగిస్తున్నారు.