పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ నిర్ణయంపై ఆసక్తి..

BRS Decision At The Time Of Parliament Election, BRS Decision, Parliament Election, BRS, Parliament Election, KCR Is The Head Of BRS, Latest Parliament Election News, TS Parliament Election, Latest BRS News, BRS Parliament Election, KTR, Telangana, Election News, Mango News, Mango News Telugu,
BRS, BRS decision at Parliament election,KCR is the head of BRS

శాసనసభ ఎన్నికలలో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బీఆర్ఎస్ .. లోక్ సభ ఎన్నికలలో ఎలా అయినా గెలవాలనే టార్గెట్‌తో  బరిలో దిగడానికి రెడీ అవుతోంది. అయితే ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ అధినేత మళ్లీ సిట్టింగ్‌లకే సీటు ఇస్తారా? లేక అభ్యర్థులను మార్చుతారా అన్న సస్పెన్స్  మాత్రం ఇంకా కొనసాగుతోంది.

తాజా ఎన్నికల ఓటమితో ఖంగుతిన్న ఉమ్మడి పాలమూరు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు..లోక్ సభ ఎన్నికలను ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో 14 స్థానాల్లో 2 స్థానాలను మాత్రమే గులాబీ పార్టీ గెలిచింది. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అయితే, ఒక్క అసెంబ్లీ సీటును కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది. దీంతో ఈసారి ఎలా అయినా పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటడానికి బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నాయి.

ఇటు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా పాలమూరు జిల్లాలోని ఎంపీ స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అందుకే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపీకపై బీఆర్ఎస్ పెద్ద కసరత్తే చేయాల్సి ఉంది.  2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు జరిగినపుడు.. అప్పుడు బీఆర్ఎస్‌దే అధికారం కాబట్టి..విజయం ఈజీగానే సాధ్యమయింది.  మహబూబ్ నగర్ ఎంపీగా మన్నే శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీగా పోతుగంటి రాములు 2019లో విజయం సాధించారు.

ఇప్పుడు రాబోతున్న పార్లమెంట్ ఎన్నికలలో  మహబూబ్ నగర్ ప్రస్తుత ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు పోటీ చేస్తారా అన్న ప్రశ్న వినిపిస్తోంది.కానీ అసెంబ్లీ ఎన్నికలలో ప్రజా వ్యతిరేకత ఉన్నాకూడా సిట్టింగులకే సీటు ఇవ్వడంతోనే బీఆర్ఎస్ ఓటమి పాలయింది. దీంతో ఈ ఎన్నికలకు బలమైన అభ్యర్థులను బరిలో దించడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా.. శాసనసభ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన ఆల వేంకటేశ్వర్ రెడ్డిని పోటీకి దింపాలని అధిష్టానం ఆలోచిస్తుంది. అలాగే  మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, రాజేందర్ రెడ్డి పేరును కూడా బీఆర్ఎస్ పరిశీలిస్తుంది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ రాములును మార్చడానికి కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నారు. అయితే పార్లమెంట్ ఎస్సీ రిజర్వడ్ కావడంతో .. ప్రముఖ ప్రజా గాయకుడు, రచయిత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను బరిలో దింపడానికి పార్టీలో చర్చ నడుస్తోంది.

మరోవైపు నాగర్ కర్నూల్ పార్లమెంట్  స్థానం నుంచి పోటీ చేయడానికి మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట.అసెంబ్లీ ఇచ్చిన ఓటమి పాఠాలతో ఈసారి ఆచితూచి అడుగేస్తున్న బీఆర్ఎస్ అధినేత…ఎలాంటి ఫలితాన్ని రాబట్టుకుంటుందో చూడాలి మరి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =