సీఎం కేసీఆర్ కు ప్రధాని మోదీ అభినందనలు, సూచనలు ఆచరణలో పెడుతామని వెల్లడి

PM Narendra Modi Appreciated CM KCR Suggestions over Covid Vaccination Programme,Mango News,Mango News Telugu,CM KCR,Telangana CM KCR,Telangana News,CM KCR Live,Telangana State,CM KCR Live Updates,CM KCR Latest,CM KCR Latest News,CM KCR Latest Updates,CM KCR Speech,CM KCR Live Pressmeet,CM KCR Pressmeet,CM KCR Pressmeet Live,KCR,Telangana News,PM Narendra Modi,PM,PM Modi,PM Modi Latest News,PM ModiNews,PM Modi Live,PM Modi Live Updates,PM Narendra Modi Appreciated CM KCR Suggestions,PM Narendra Modi Appreciated CM KCR,Covid Vaccination Programme,Covid Vaccination

రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై ఆదివారం నాడు ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ తో సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. కరోనా నియంత్రణ కోసం రాష్ట్రం చేపడుతున్న చర్యలను సీఎం వివరించారు. కరోనాను నియంత్రించే క్రమంలో తీసుకోవాల్సిన చర్యల గురించి సీఎం కేంద్ర మంత్రికి కొన్ని విలువైన సూచనలు చేశారు. కరోనా వ్యాప్తిని పెంచే అవకాశం వున్న ‘అతివేగంగా వ్యాప్తి కారకులను’ గుర్తించి వారికి ముందువరసలో టీకాలు వేస్తే బాగుంటుందని సూచించారు. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, కండక్టర్లు, గ్యాస్ ను డెలివరీ చేసే బాయ్స్, స్ట్రీట్ వెండర్స్, ఇంకా పలు దిక్కులకు పోయి పనిచేసే కార్మికులు తదితరులను కరోనా వ్యాప్తి అధికం చేసే అవకాశాలున్న వారిగా ప్రత్యేక కేటగిరీ కింద గుర్తించి వాక్సిన్ ను అందచేసేందుకు నిబంధనలను సడలించాలన్నారు. ఆ వెసులుబాటును రాష్ట్రాలకు కల్పించడం ద్వారా కరోనా వ్యాప్తిని అధికభాగం అరికట్టే అవకాశాముంటుందని సీఎం తెలిపారు. సీఎం సూచనలమీద సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి ప్రధానితో చర్చించి ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

సీఎం కేసీఆర్ కు ప్రధాని మోదీ అభినందనలు, సూచనలు ఆచరణలో పెడుతామని వెల్లడి :

సమీక్షా సమావేశానంతరం సీఎం కేసీఆర్ తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. కేంద్ర మంత్రికి సీఎం చేసిన సూచనలను తనకు వివరించారని తెలిపారు. “మీది మంచి ఆలోచన, మీ సూచనలు చాలాబాగున్నాయి వాటిని తప్పకుండా ఆచరణలో పెడుతాం మీ సూచనలకు అభినందనలు” అంటూ ప్రధాని సీఎంను అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి మరింతగా ఆక్సీజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్లు సరఫరా చేయాలని, సీఎం చేసిన విజ్జప్తికి ప్రధాని సానుకూలంగా స్పందించారు. అందుకు సంబంధించి సత్వరమే చర్యలు చేపడతామని ప్రధాని మోదీ సీఎం కేసీఆర్ కు హామీ ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here