
తెలంగాణలో నేటి నుంచి అంటే జూన్ 7 నుంచి ప్రజావాణి పునఃప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమం లోక్ సభ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల.. ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ముగియడంతో..ప్రజావాణి కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించబోతున్నారు. ప్రజావాణి ఇంఛార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం..నేటి నుంచి అంటే శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉండటం వల్ల ప్రజావాణి అర్జీల కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడినట్లలు చిన్నారెడ్డి వివరించారు.
మొత్తంగా ఇకపై లోక్ సభ ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో ప్రతి వారం మంగళ, శుక్ర వారాల్లో కొనసాగుతుందని చిన్నారెడ్డి చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలంతా తమ తమ సమస్యలను అర్జీల ద్వారా ప్రజావాణిలో అందజేయాలని ఆయన కోరారు. అయితే, ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ దివ్య వ్యవహరిస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన వెంటనే ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలంతా తమతమ సమస్యలను ప్రజావాణి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని రేవంత్ రెడ్డి కోరారు. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు ప్రజావాణి కార్యక్రమానికి రావడంతో.. ఫిర్యాదులు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ