తెలంగాణలో మరో ఎమ్మెల్యే కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Quthbullapur MLA Vivekananda Goud Tested Positive for Covid-19

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్‌ కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే ఎమ్మెల్యే భార్య, కుమారుడు, వారి ఇంట్లో పని చేసే మనిషికి  పాజిటివ్‌ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో వైద్యుల సూచన మేరకు 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందనున్నట్టు ఎమ్మెల్యే వివేకానంద తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సామాజిక దూరం పాటిస్తూ మాస్క్‌ లు ధరించి, శానిటైజర్లు వాడుతూ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu