పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం

Red Alert For Five Districts Of Telangana, Red Alert For Telangana, Red Alert, Heavy Rains, Five Districts Heavy Rains, Telangana, Red Alert For Five Districts, Telangana, Windstorm In Western, Central Bay Of Bengal, Weather Report, Red Alert In Hyderabad, TS Live Updates,Political News, Mango News, Mango News Telugu
Telangana, Red alert for five districts, Telangana, Windstorm in western, central Bay of Bengal

పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో జులై 19  ఉదయం  వాయుగుండం ఏర్పడింది..ఉత్తర బంగాళాఖాతంలో జులై 18న  ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి అదే రోజు  రాత్రి తీవ్ర అల్పపీడనంగా మారి జులై 19 వ తేదీ  ఉదయానికి వాయుగుండంగా మారినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది సముద్రమట్టం నుంచి 1.5 కి.మీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న రెండ్రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు, మరి కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ  రెడ్‌అలర్ట్‌ జారీ చేశారు. నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల,  జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు… మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీచేశారు. కాగా తెలంగాణలో జులై 19న  సగటున 2.77 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నైరుతి సీజన్‌లో శుక్రవారం నాటికి రాష్ట్రంలో సగటున 25.76 సెంటీమీటర్ల వర్షం నమోదవుతుందని అధికారులు అంచనా వేయగా.. 31.32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

మరోవైపు భారీ వర్షాలకు ములుగు జిల్లా వెంకటాపురం కె.మండలం తానిపర్తికి చెందిన 45 ఏళ్ల బానారి రాజు గోదావరిలో గల్లంతయ్యాడు. చేపల వేటకోసం గురువారం వెళ్లిన బానారి రాజు.. శుక్రవారం ఉదయం అయినా తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇక శుక్రవారం తెల్లవారుజామున మహదేవపూర్‌ మండలం అన్నారం వైపు నుంచి దామెరకుంట వైపుగా వెళ్లే ట్రాలీ ఆటో గుండ్రాత్‌పల్లి సమీపంలో ఉన్న అలుగువాగులో కొట్టుకుపోయింది. అయితే డ్రైవర్‌ వెంటనే అప్రమత్తమై ఆటో ఎక్కి అరవడంతో స్థానికులు గమనించి అతనిని రక్షించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE