టాలీవుడ్: జూన్ మొదటి వారం నుంచి షూటింగ్స్ కు అనుమతి

Celebrities Meet CM KCR, Tollywood Celebrities, Tollywood Celebrities Meet CM KCR, Tollywood Film Shooting, Tollywood Latest News, Tollywood Shooting, Tollywood Shooting To Start, Tollywood Updates, Tollywood Updates 2020, Tv Shootings, TV Shootings Likely to Start

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో గత రెండు నెలలుగా తెలుగు చిత్ర పరిశ్రమ (టాలీవుడ్) కార్యకలాపాలు పూర్తిస్థాయిలో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్ లకు అనుమతులు, థియేటర్స్ తెరవడం తదితర అంశాలపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను తెలుగు సినీ ప్రముఖులు కలిశారు. సీఎం కేసీఆర్ ను కలిసిన వారిలో సినీ నటులు చిరంజీవి, నాగార్జున, దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్, ఎన్.శంకర్, కొరటాల శివ, మెహర్ రమేష్, నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, రాధాకృష్ణ, సీ. కళ్యాణ్, సురేష్ బాబు, జెమిని కిరణ్, ప్రవీణ్ బాబు తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా కరోనా సమయంలో చిత్ర పరిశ్రమ ఎదుర్కొన్న సమస్యలు, అలాగే సినీ కార్మికుల కోసం సీసీసీ ద్వారా చేపట్టిన సహాయక చర్యల గురించి సీఎం కు వివరించారు. సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని, సినిమా థియేటర్లు తెరిచే అవకాశం ఇవ్వాలని సినీ రంగ ప్రముఖులు సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. దీనికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. సినిమా పరిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నందున రీ ప్రొడక్షన్, షూటింగు నిర్వహణ, థియేటర్లలో ప్రదర్శనలను దశలవారీగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. తక్కువ మందితో, ఇండోర్ లో చేసేందుకు వీలున్న రీ ప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవాలని సీఎం కేసీఆర్ చెప్పారు. తర్వాత దశల వారీగా జూన్ మాసంలో సినిమా షూటింగులు ప్రారంభించాలని చెప్పారు. చివరగా అప్పుడున్న పరిస్థితిని బట్టి, సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని సీఎం వెల్లడించారు.

సినీ పరిశ్రమ బతకాలని, అదే సందర్భంగా కరోనా వ్యాప్తి కూడా జరగవద్దని సీఎం కేసీఆర్ అన్నారు. అందువలన సినిమా షూటింగులను వీలైనంత తక్కువ మందితో లాక్‌డౌన్ నిబంధనలను అనుసరించి జరుపుకోవాలని చెప్పారు. అలాగే కరోనా వ్యాప్తి నియంత్రణకు అనుసరిస్తున్న మార్గదర్శకాల ప్రకారం చిత్ర పరిశ్రమ పాటించాలని అన్నారు. ముందుగా ఎంత మందితో షూటింగులు నిర్వహించుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో సమావేశమై చర్చించాలని సినీ ప్రముఖులకు సీఎం కేసీఆర్ సూచించారు. అనంతరం ప్రభుత్వం ఖచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించి, షూటింగులకు అనుమతి ఇస్తుందని వెల్లడించారు. ఒకసారి షూటింగులు మొదలయ్యాక పరిస్థితులపై కొంత అంచనా వస్తుందని, దానికి అనుగుణంగా సినిమా థియేటర్లు ఓపెన్ చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

Subscribe to our Youtube Channel Mango News for the latest News.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.
Video thumbnail
Telugu Film Industry Celebrities Emergency Meeting At Megastar Chiranjeevi's House | Mango News
05:22
Video thumbnail
Minister Talasani Srinivas Yadav Speaks About Opening Of Theaters | #TelanganaLockdown | Mango News
03:23
Video thumbnail
Producer C Kalyan Gives Clarification Over Post Production Of Movies | Telangana News | Mango News
03:59
Video thumbnail
Minister KTR Inaugurates Biodiversity Flyover Level-1 | Telangana News | Mango News
06:05
Video thumbnail
CM KCR Serious On Reporter In Press Meet | Lockdown 4.0 Guidelines | Telangana News | Mango News
05:00
Video thumbnail
CM KCR Superb Answer For Reporter Question In LIVE | #KCRPressMeet | Lockdown Update | Mango News
08:19
Video thumbnail
CM KCR Says Telangana Is Breaking All State Records Over Production Of Crops | TS News | Mango News
07:32
Video thumbnail
CM KCR Special Orders Over Cultivation Of Crops In Telangana | Telangana Latest News | Mango News
07:23
Video thumbnail
MP Revanth Reddy Request Congress Activists To Help Migrant Workers | Telangana News | Mango News
08:24
Video thumbnail
CM KCR Speaks About PM Modi's 20 Lakh Crores Of Economic Package | Lockdown Updates | Mango News
07:06
Video thumbnail
CM KCR Sensational Comments On Modi's 20 Lakh Crores Economic Package | #KCRPressMeet | Mango News
07:23
Video thumbnail
CM KCR Gives Green Signal For Bus Services In Telangana | Lockdown 4.0 Guidelines | Mango News
03:26
Video thumbnail
CM KCR Gives Clarity Over Containment And Green Zones In Telangana | Lockdown Updates | Mango News
05:58
Video thumbnail
CM KCR Reveals All Details About Shops That Should Open In Telangana | #KCRPressMeetLive | MangoNews
11:07
Video thumbnail
CM KCR Sensational Decision On Bars And Pubs In Telangana | #Corona | #TelanganaLockdown | MangoNews
10:36
Video thumbnail
రేపటి నుండి మాస్క్ లేకపోతె రూ 1000 ఫైన్ | CM KCR About Fines For Not Wearing Masks | #CMKCRLive
04:43
Video thumbnail
CM KCR Suggests Telangana Farmers Over Cultivation Of Crops | #TelanganaLockdown | Mango News
06:26
Video thumbnail
CM KCR Speaks About Greatness Of Migrant Workers In Telangana | #TelanganaLockdown | Mango News
07:02
Video thumbnail
CM KCR Announces Complete Lockdown In Hyderabad | #Coronavirus | Telangana News | Mango News
08:40
Video thumbnail
CM KCR Speaks About Telangana Govt Care Towards Farmers | #CoronaVirus | Telangana News | MangoNews
05:21
Video thumbnail
Minister Harish Rao Says Rs 1000 Fine For People Without Mask | #Corona | #TSLockdown | Mango News
04:21
Video thumbnail
MP Revanth Reddy Slams Opposition Over Water Issue In Telangana | Telangana Latest News | Mango News
08:43
Video thumbnail
Congress MP Revanth Reddy Powerful Speech At Deeksha | #GandhiBhavan | Telangana News | Mango News
12:03
Video thumbnail
CM KCR Vs Revanth Reddy War Of Words Over Liquor Shops Opening In Telangana | #Covid19 | MangoNews
12:38
Video thumbnail
Revanth Reddy Straight Question To CM KCR Over Water Issue While Addressing Media | MangoNews
03:54
Video thumbnail
Congress MP Revanth Reddy Comments Over Coronavirus Cases In Telangana | #Covid19 | MangoNews
06:07
Video thumbnail
Mulugu MLA Seethakka Angry Speech Over Spreading False Rumors On Her | Telangana News | Mango News
04:01
Video thumbnail
Etela Rajender Superb Answer To Reporter Over Traffic Jams In Hyderabad | #Covid19 | Mango News
07:31
Video thumbnail
Minister Etela Rajender About New Green Zone Districts In Telangana | #CoronaVirus | Mango News
07:38
Video thumbnail
Minister Etela Rajender Says Corona Positive Woman Safely Delivers Baby | #Covid19 | Mango News
05:58
Video thumbnail
CM KCR Serious Comments On Opposition Parties | #CoronaOutbreak | #TelanganaLockdown | Mango News
07:33
Video thumbnail
CM KCR Asks Apologies To Muslims For Facing Problems In Ramadan Month | #CoronaVirus | Mango News
10:12
Video thumbnail
CM KCR About Providing Salaries For Govt Employees | #LockdownUpdates | Telangana News | Mango News
11:16

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here