వరంగల్‌‌లో నేడు రేవంత్ రెడ్డి పర్యటన

CM Revath,CM special focus on Warangal, smart city Warangal, Revanth Reddy's visit to Warangal
CM Revath,CM special focus on Warangal, smart city Warangal, Revanth Reddy's visit to Warangal

తొలిసారి జిల్లాల పర్యటన మొదలు పెట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. .  మొదటిసారి వరంగల్ అభివృద్ధిపై ముందుగా ప్రత్యేక దృష్టి సారించారు. దీనిలో భాగంగానే ఈ రోజు మధ్యాహ్నం వరంగల్‌కు వెళ్లనున్న  సీఎం .. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్‌మెంట్‌తో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ఉన్నత స్థాయి సమీక్షను జరపనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

వరంగల్ స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్‌పై ఫోకస్ పెట్టిన  రేవంత్ రెడ్డి .. హైబదరాబాద్ నుంచి స్పెషల్  హెలికాప్టర్ లో మధ్యాహ్నం 1.30 గంటలకు  సంగెం మండలంలో గల కాకతీయ మేఘా టెక్స్‌టైల్ పార్క్‌కు చేరుకుంటారు.  ముందుగా టెక్స్‌టైల్ పార్క్ నిర్మాణ పనులను పరిశీలించి..ఆ తర్వాత రోడ్డు మార్గంలో వరంగల్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు పరిశీలిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు హనుమకొండ కలెక్టర్ ఆఫీసుకు చేరుకుని.. సాయంత్రం 5.30 గంటల వరకు వరంగల్ సిటీ అభివృద్ధిపై అధికారులు, ముఖ్య నేతలతో ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహిస్తారు..

సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ఎజెండాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కుడా మాస్టర్ ప్లాన్, ఔటర్ రింగ్ రోడ్డు, ఎంజీఎం హాస్పిటల్ ప్రక్షాళన, మామునూరు ఎయిర్ పోర్ట్, రోడ్ల విస్తరణ, మోడల్ బస్టాండ్ నిర్మాణంతో పాటు వివిధ డెవలప్మెంట్ పనులపై సమీక్షిస్తారు. దీనికోసం ఇప్పటికే ఆయా శాఖల ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి సీఎంకు వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. సమీక్ష తర్వాత సాయంత్రం 5.40 గంటలకు హంటర్ రోడ్‌లోని మెడికవర్ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్‌ని ప్రారంభించిన తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి వరంగల్ అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష జరుపుతుండటంతో వరంగల్ అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అట్టహాసంగా ఏర్పాట్లను పూర్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన భారీ ఎత్తున హోర్డింగ్స్, ఫ్లెక్సీలతో వరంగల్ నగరమంతా కళకళలాడుతోంది. మరోవైపు  ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడటానికి, శాంతి భద్రతలను కాపాడటానికి పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE