తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా 15వేల రూపాయలు ఇస్తామని 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఎన్నికలు ముగియడం..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదయిపోయిందని ..కానీ హామీలు మాత్రం అమలు కాలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పినట్లుగానే.. ఈ ఏడాది యాసంగి నుంచి ఎకరాకు రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామని ప్రకటించింది. ఈమేరకు జనవరి 26న ఈ పథకాన్ని ప్రారంభించడంతో.. 27వ తేదీన ఎంపిక చేసిన గ్రామాల రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమయ్యాయి.
కానీ వెంటనే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో రైతుల ఖాతాల్లో జమ నిలిచిపోయింది. అయితే దీనిపై ఎలక్షన్ కమిషన్ అభ్యంతరం చెప్పకపోవడంతో మళ్లీ రైతుల అకౌంట్లలో డబ్బులు జమవుతున్నాయి. మూడు రోజుల క్రితం నుంచి మళ్లీ రెండెకరాలలోపు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి. మొత్తం 11,79,247.17 ఎకరాల భూములకు 8లక్షల65వేల 999 మంది రైతులకు 7,07,54,84,664 రూపాయలు అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
జనవరి 27న తెలంగాణ వ్యాప్తంగా ఎంపిక చేసిన 577 గ్రామాల్లోని రైతులకు.. పైలట్ ప్రాజెక్టు కింద రైతు భరోసా డబ్బులను వేసింది. ఇలా ఇప్పటి వరకూ 9,48,332,35 ఎకరాలకు 4,41,911 మంది రైతుల అకౌంట్లలో రూ.5,68,99,97,265 జమయ్యాయి. ఫిబ్రవరి 5వ తేదీలోపు 9,29,234.20 ఎకరాలకు సంబంధించిన 17,03,419 మంది రైతుల అకౌంట్లలో రూ.5,57,54,07,019 క్రెడిట్ అయ్యాయి. ఫిబ్రవరి 12 నుంచి మూడెకరాలకు.. ఫిబ్రవరి 12 నుంచి మూడు ఎకరాల భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులను క్రెడిట్ చేసినట్టు వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించారు.
సాగు చేస్తున్న భూమిని బట్టి తెలంగాణ ప్రభుత్వం వరుసగా పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది . మార్చిలోపు ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం రెండు ఎకరాలలోపు ఉన్న రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులు జమ చేసింది. దశల వారీగా మిగిలిన కూడా రైతులందరికీ సాయం అందించనుంది. అర్హత ఉన్నవారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాకపోతే సంబంధిత ఏఈవో లేదా ఏవోలను సంప్రదించాలని అధికారులు చెబుతున్నారు. ఏదైనా పొరపాటు ఉంటే సరిచేస్తారని.. తర్వాత డబ్బులు క్రెడిట్ అవుతాయని తెలిపారు.