
మొగలి రేకులు టీవీ సీరియల్‌తో ఆర్కే నాయుడిగా గుర్తింపు తెచ్చుకుని, సినిమాల్లోనూ నటించిన ములుకుంట్ల సాగర్ నవంబర్ 6న జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా సాగర్‌కు జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. తెలంగాణలో జనసేన పార్టీ ప్రచార కార్యదర్శిగా సాగర్‌ను నియమించారు.
హైదరాబాదులోని ప్రశాసన్ నగర్‌లో ఉన్న జనసేన పార్టీ మెయిన్ ఆఫీసులో జరిగిన ఓ కార్యక్రమంలో, పవన్ కల్యాణ్ .. సాగర్‌కు నియామక పత్రాన్ని అందించారు. జనసేన, బీజేపీ కూటమి సిద్ధాంతాలను తెలంగాణ ఎన్నికల్లో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పవన్ సూచించారు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం కోసం సాగర్‌ను కృషి చేయాలని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా పార్టీ ప్రచార కార్యదర్శిగా సాగర్ బాధ్యతలు సమర్థంగా నిర్వహించాలని జనసేనాని ఆకాంక్షించారు.
ములుకుంట్ల సాగర్ స్వస్థలం రామగుండం నియోజకవర్గం. మొగలి రేకులు సీరియల్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాత్రికి రాత్రే మంచి స్టార్ డమ్ తెచ్చుకున్నాడు నటుడు సాగర్. ఇందులో ఆర్కే నాయుడు పాత్రతో ఒక్క సారిగా ఫ్యామిలీ యాక్టర్‌గా అందరిలో ఫేమస్ అయిపోయాడు. అంతకు ముందు చక్రవాకం సీరియల్‌తోనూ బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు. అలాగే మనసంతా నువ్వే, మిస్టర్ పర్‌ఫెక్ట్ వంటి సినిమాల్లోనూ క్యారెక్టర్ రోల్స్ పోషించాడు.
అలాగే 2016లో సిద్ధార్థ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా అది హిట్ కాకపోవడంతో చాలా రోజుల పాటు సీరియల్స్, సినిమాలకు దూరంగా ఉండిపోయాడు. మధ్యలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనే ఓ మూవీలో కనిపించాడు. అయితే 2021లో షాదీ ముబారక్ మూవీతో మళ్లీ హీరోగా కనిపించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ రిలీజ్ చేసిన ఆ మూవీతో అప్పట్లో మంచి హిట్ కొట్టాడు. దీంతో ఇక సాగర్ సినిమాల్లోనే కంటిన్యూ అవుతాడని అంతా అనుకున్నారు.
కానీ షాదీ ముబారక్ సినిమా తర్వాత అసలు స్క్రీన్‌పై కనిపించలేదు.అప్పట్లో కొన్ని పెద్ద నిర్మాణ సంస్థలు కూడా సాగర్‌తో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చినా కొన్ని కారణాలతో తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ది హండ్రెడ్ అనే ఓ మూవీలో నటిస్తున్న సాగర్ .. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తున్నాడు.
అంతేకాదు కొన్ని టీవీ షోల్లోనూ అతిథిగా కనిపిస్తోన్న సాగర్..నవంబర్ 6న తాజాగా జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాగర్‌కు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఏడాది ప్రారంభంలో పవన్ కళ్యాణ్‌ను కలిసిన సాగర్.. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘పవర్‌ఫుల్ లీడర్ పవన్ కళ్యాణ్ అన్నను కలిశానంటూ పోస్ట్ పెట్టారు. ఈ రోజును ఎంతో అద్భుతంగా మొదలుపెట్టానని.. ఎంతో వినయపూర్వకమైన, నిరాడంబరమైన వ్యక్తితో కొంత టైమ్‌ను గడపడం తనకు చాలా సంతోషంగా ఉందన్నాడు. పీకే అన్నతో అద్భుతమైన భేటీ జరిగిందని భావిస్తున్నానంటూ సాగర్ అప్పట్లో రాసుకొచ్చాడు . దీంతో అప్పట్లోనే సాగర్ రాజకీయాల్లోకి అడుగుపెడతాడనే ప్రచారం జోరుగా సాగింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE