వివాదాలకు కేరాఫ్ ధర్మపురి అర్వింద్

Dharmapuri Arvind is a c/o controversies,Dharmapuri Arvind,Arvind is a c/o controversies,Dharmapuri is a c/o controversies,Mango News,Mango News Telugu,BJP MP Dharmapuri Arvind,Ranji cricketer, politician , controversies, Dharmapuri Arvind, contesting from Nizamabad, BJP MLA,Dharmapuri Arvind Latest News,Dharmapuri Arvind Latest Updates,Dharmapuri controversies Latest News,Dharmapuri controversies Latest Updates,Dharmapuri controversies Live News
Ranji cricketer, politician, Dharmapuri Arvind , controversies, Dharmapuri Arvind, contesting from Nizamabad, BJP MLA

నవంబర్ 30న తెలంగాణలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో.. బీజేపీ తరపున నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్  పోటీ చేస్తున్న విషయం తెలిసిందే . అలాగే నవంబర్ 8న కోరుట్లలో బీజేపీ ఎమ్మెల్యేగా ఆయన నామినేషన్ వేశారు.  అంతే కాదు తన అఫిడివేట్‌లో రూ. 107.43 కోట్ల ఆస్తులు ఉన్నాయని..తనపై 17 కేసులు కూడా ఉన్నాయని  ధర్మపురి అర్వింద్ ప్రకటించారు.

 

నిజానికి బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ .. కాంట్రవర్సీ కామెంట్లకు  కేరాఫ్ అడ్రస్‌గా నిలిచి  చాలా సందర్భాల్లో వార్తల్లోకి ఎక్కారు. తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ధర్మపురి అర్వింద్..గతంలో నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పార్లమెంట్ సభ్యుడిగా విజయం సాధించారు.

 

అంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో నిజామబాద్ నియోజకవర్గం నుంచి ధర్మపురి అరవింద్.. బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేసి..తన ప్రత్యర్ద పార్టీ అభ్యర్ధి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఓడించారు. అప్పట్లో ధర్మపురి విజయం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

 

అయితే ఇప్పుడంటే రాజకీయనేతగా గుర్తింపు పొందారు కానీ..ఒకప్పుడు ధర్మపురి అరవింద్ రంజీ క్రికెటర్‌గా మంచి గుర్తింపే పొందిన విషయం చాలామందికి తెలియదు. 1995,1996లో హైదరాబాద్‌లో ఎన్నో ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లలో ఆడి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా పెంచుకున్నారు. నిజానికి అర్వింద్  నిజామాబాద్ నుంచి మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ్యునిగా ఎన్నికైన డి.శ్రీనివాస్ చిన్న కొడుకే  అర్వింద్ అన్న విషయం కూడా చాలామందికి తెలియదు.

 

మొదటి నుంచి ధర్మపురి అర్వింద్ రాజకీయ జీవితంలో ఎన్నో వివాదాలు ఆయనను వెంటాడుతూనే ఉన్నాయి. 2019 ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడివిట్‌లో.. ధర్మపురి అర్వింద్ పీజీ చదవుకపోయినా కూడా  చదివినట్టు చూపించారని  బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపించారు. దీనికి సంబంధించి ఆధారాలను కూడా పక్కాగా సేకరించారు.

 

రాజస్థాన్‌లోని విద్యాపీఠ్ యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా  ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివినట్లు ధర్మిపురి అర్వింద్ తన ఎన్నికల అఫిడవిట్‌లో చెప్పుకొచ్చారు. అయితే రాజస్థాన్‌లోని విద్యాపీఠ్  యూనివర్సిటీలో  అరవింద్ చదివారా, లేదా అనేది ఆర్టీఐ ద్వారా గులాబీ నేతలు ఎంక్వైరీ కూడా చేశారు.అయితే  ఆ పేరుతో తమ యూనివర్సిటీలో ఎవరూ చదవలేదనే సమాధానం ఆ యూనివర్శిటీ నుంచి వచ్చిందని టీఆర్ఎస్ నేతలు చెప్పడంతో ఆ విషయం  అప్పట్లో హాట్ టాపిక్ అయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =