ప్రతీ విషయానికి ఓ టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అంతవరకూ వార్ వన్ సైడ్‌గా నడిచినా ఒకే ఒక టర్నింగ్ పాయింట్ వార్‌ను అవతలివారికి ఫేవర్‌కు మారిపోతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలోనూ అదే జరిగింది. సంధ్య థియేటర్ ఇన్సిడెంట్‌కు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ కేసులో ఎన్నో ట్విస్టులు చూస్తున్నవారికి..తాజాగా మరో ట్విస్ట్‌తో కొత్త యాంగిల్ వెలుగులోకి వచ్చింది.
కాగా ఈ ఘటన పై పోలీసులు అల్లు అర్జున్ తప్పు ఉన్నట్టుగా చూపిస్తూ పది నిమిషాల వీడియో ఫుటేజీ ని విడుదల చేసారు. అంతేకాదు అల్లు అర్జున్‌కు నోటీసులు ఇచ్చిన దగ్గర నుంచి అరెస్ట్ వరకూ..చూసిన పరిణామాలతో, పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్లతో కేవలం తప్పంతా అల్లు అర్జున్‌దే అన్నట్లుగా చాలామంది భావించారు. కానీ ఎన్హెచ్ఆర్సీ తెలంగాణ డీజీపీకి నోటీసులు పంపడంతో అరే అల్లు అర్జున్ సీన్లో అసలు ఇదెలా మర్చిపోయాం అంతా అని ఆలోచించేలా థాట్ ప్రాసెస్ మారిపోయింది.
డిసెంబర్ 4న అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వచ్చిన రోజు రాత్రి జనాలను కంట్రోల్ చేసేందుకు పోలీసులు విపరీతమైన లాఠీ ఛార్జ్ చేశారు. ఈ ఘటన కారణంగానే అక్కడ అలజడి ఎక్కువయింది. దీనిపై లాయర్ రామారావు ఇచ్చిన కంప్లైంట్‌ను పరిగణనలోకి తీసుకున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చాలా ఘాటుగా రియాక్ట్ అయింది. ఆరోజు అక్కడికి వచ్చిన వారిపై ఇష్టానుసారంగా లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
కానీ ఘటన జరిగిన రోజు పోలీసులు హద్దులు దాటి అక్కడికి వచ్చిన అభిమానులపై లాఠీ ఛార్జ్ చేసినట్టు లాయర్ రామారావు ఆరోపించారు. దానికి తగిన ఆధారాలతో సహా ఆయన కమిషన్ కి అందచేయగా, కమిషన్ చాలా తీవ్ర స్థాయిలో పోలీసుల తీరుపై మండిపడింది. ఈ విషయం తెలుసుకున్న బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నిజానిజాలు వెలుగులోకి వచ్చి తమ హీరోను ఈ కేసునుంచి బయటపడితే చాలని కామెంట్లు పెడుతున్నారు.
లాయర్ రామారావు దాఖలు చేసిన పిటీషన్ ని విచారించిన కమిషన్ సభ్యులు, నాలుగు వారాల్లో పూర్తి నివేదికను తమకు ఇవ్వాలని తెలంగాణ డీజీపీ జితేందర్‌కి ఆదేశాలు జారీ చేసారు. దీనికి డీజీపీ నుండి ఎలాంటి రియాక్షన్ రాబోతుందో చూడాలి. డీజీపీ తక్షణమే పోలీసులపై చర్యలు తీసుకుంటారా? లేదా వాళ్ల వెర్షన్ ని వినిపించే ప్రయత్నం చేస్తారా అనేది వెయిట్ అండ్ సీ.