సీఎం కేసీఆర్ ను కలిసిన ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీలు

CM KCR, Mango News Telugu, Nominees for MLCs have met CM KCR, Pragathi Bhavan, State Government Nominees for MLCs, telangana, Telangana CM KCR, Telangana MLC Seats, Telangana News, Telangana Political News, Telangana State Cabinet

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలకు ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవా కేంద్రం చీఫ్ అడ్వయిజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను రాష్ట్ర మంత్రివర్గం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ పేర్లను ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా ఖరారైన గోరటి వెంకన్న, బస్వారాజు సారయ్య, బోగారపు దయానంద్ శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ను కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ