వైఎస్ఆర్ బీమా పథకం విధివిధానాలు ఖరారు

AP Government, AP Government has Released YSR Bheema Scheme Terms, AP YSR Bheema Scheme, AP YSR Bheema Scheme 2020, Mango News Telugu, YSR Bheema, YSR Bheema Scheme, YSR Bheema Scheme 2020, YSR Bheema Scheme In AP, YSR Bheema Scheme News, YSR Bheema Scheme Terms, YSR Bheema Scheme Updates

బియ్యం కార్డు ఉన్నవారికి లేదా దారిద్యరేఖకు దిగువున ఉన్న ప్రతి కుటుంబానికి ఉచితంగా బీమా సౌకర్యాన్ని కల్పించే “వైఎస్ఆర్ బీమా” పథకాన్ని ఇటీవలే ఏపీ సీఎం వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 1.41 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ బీమా పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలపై రాష్ట్ర పంచాయతీరాజ్,‌ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.

వైఎస్ఆర్ బీమా పథకం విధివిధానాలు:

  • ఆపద సమయంలో లబ్ధిదారుని కుటుంబాలకు అదేరోజున తక్షణ సాయం కింద గ్రామ సచివాలయం నుంచి రూ.10 వేలు అందజేత.
  • వైఎస్ఆర్ బీమా పథకానికి అర్హత గలవారు వారి పేర్లను ఎప్పుడైనా గ్రామా సచివాలయాల్లో నమోదు చేసుకోవచ్చు.
  • వాలంటీర్‌ అందుబాటులో లేని ప్రాంతాల్లో వైఎస్ఆర్‌ బీమా కాల్‌ సెంటర్‌ ద్వారా సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్లకు సమాచారం అందిస్తారు. వారి ద్వారా లబ్ధిదారుని కుటుంబాలకు ఈ సేవలు అందనున్నాయి. ఈ మేరకు ఈ పథకం కోసం ప్రతి గ్రామ సచివాలయంలో రూ.20 వేలు డిపాజిట్‌ చేయనున్నారు.
  • జిల్లా కేంద్రాల్లో ఉండే వైఎస్ఆర్‌ బీమా కాల్‌ సెంటర్లు ఆయా జిల్లాల పరిధిలో క్లెయిమ్‌ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పర్యవేక్షించనున్నాయి.
  • ఈ పథకం అమలుపై నిరంతర పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో కమిటీని ఏర్పాటు.
  • సాధారణ మరణం అయితే లబ్ధిదారుని నామినీకి 15 రోజుల వ్యవధిలో ఇన్సూరెన్స్‌ కంపెనీ ద్వారా మిగతా డబ్బులు అందే ఏర్పాటు.
  • ప్రమాదవశాత్తు మరణిస్తే 21 రోజుల వ్యవధిలో ఇన్సూరెన్స్‌ డబ్బులు అందజేసే ఏర్పాటు.
  • ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికీ 55 రోజుల్లో ఇన్సూరెన్స్‌ కంపెనీ ద్వారా క్లెయిమ్‌ రూపంలో డబ్బులు అందేలా ఏర్పాటు. .
  • ఇన్సూరెన్స్‌ కంపెనీ ద్వారా డబ్బులు అందించే విషయంలో లబ్ధిదారుని కుటుంబానికి వాలంటీర్, సచివాలయ సిబ్బంది‌ తోడ్పాటు అందిస్తారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =