
బీజేపీ నూతన తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష నియామకంపై కసరత్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజగా ఢిల్లీలో అధినాయకత్వం టీ బీజేపీకి కొత్త చీఫ్ ఎంపిక ప్రక్రియను షురూ చేసినట్లు తెలుస్తోంది. కొత్త దళపతిని ఈ నెలాఖరులోగా నియమించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండటంతో.. సెలక్షన్ ప్రాసెస్‌ను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ముందుగా పార్టీ జాతీయ అధ్యక్షుడి నియామకం ఉంటుందని, ఆ తర్వాత తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్‌ను నియమిస్తారని వార్తలు వినిపించాయి. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో.. జాతీయ అధ్యక్షుడి నియామకం కంటే ముందే ఇది ఉంటుందని తెలుస్తోంది. టీ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఇప్పటికే కొంతమంది నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా.. అందులో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ముందు వరుసలో ఉన్నారట.
బీజేపీ అధినాయకత్వం ఒక్కో రాష్ట్రానికి రాష్ట్ర అధ్యక్షుడిని నియమిస్తూ వస్తోంది. అయితే త్వరలోనే తెలంగాణలో కూడా అతి త్వరగా నియమించే అవకాశముందనే చర్చ జోరుగా జరగుతోంది. త్వరలో ఎన్నికల జరగనున్న హర్యానాలో కూడా పార్టీ ఇటీవల అధ్యక్షుడిని నియమించింది. దీంతోనే ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర అధ్యక్షుడినిత్వరగా నియమించాలని హైకమాండ్ భావిస్తోంది. ఈ పోస్ట్ ఆశిస్తున్న వారి లిస్టులో ఉన్న ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచందర్ రావు వంటి వారు ఉన్నారు.
సామాజిక వర్గాల ప్రకారం చూస్తే.. మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్‌కి ఇప్పటికే కేంద్రమంత్రి పదవి ఇవ్వడంతో అదే మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన ధర్మపురి అర్వింద్‌కు పార్టీ పగ్గాలు ఇస్తారా అన్నది సస్పెన్స్‌గా మారింది. మరోవైపు ఇప్పటికే కేంద్ర మంత్రిగా, పార్టీ రాష్ట్రఅధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉండటంతో.. అదే సామాజిక వర్గానికి చెందిన డీకే అరుణకు ఇస్తారా అన్నది కూడా డౌటే. ఇదిలా ఉండగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి కూడా ఈ చీఫ్ రేసులో ఉన్నా కూడా..బీజేఎల్పీ బాధ్యతలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహేశ్వర్ రెడ్డికి ఇవ్వడంతో ఈ సారి పార్టీ పగ్గాలు బీసీ నేతలకే ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE