ఆరోగ్య మహిళ కార్యక్రమంలో 57 రకాల వైద్య పరీక్షలు, రేపే రాష్ట్రవ్యాప్తంగా 100 ఆరోగ్య కేంద్రాల్లో ప్రారంభం

Arogya Mahila to Start on March 8th in 100 Health Centers Across Telangana 57 Types of Medical Tests will be Conducted,Arogya Mahila to Start on March 8th,100 Health Centers Across Telangana,57 Types of Medical Tests will be Conducted,Mango News,Mango News Telugu,Arogya Mahila,Arogya Mahila Telangana,Telangana Arogya Mahila,Arogya Mahila Latest News,Arogya Mahila Updates,Arogya Mahila News and Updates,Arogya Mahila Latest News and Updates,Telangana CM KCR

ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని మహిళల ఆరోగ్య పరిరక్షణకై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరో విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో మహిళా ఆరోగ్య రక్షణకై ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలోని 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మార్చి 8వ తేదీన ప్రారంభించనున్నారు. ప్రతీ మంగళవారం ప్రాథమిక వైద్య కేంద్రాల్లో మహిళలకు ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అక్కడికక్కడే తగు మందులు ఇవ్వడంతోపాటు అవసరమైన వారిని రెఫరల్ ఆసుపత్రులకు పంపిస్తారు. ఆరోగ్య మహిళ కింద రాష్ట్రంలోని 33 జిల్లాల్లో అన్ని వయస్సుల మహిళలకు 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.

ప్రధానంగా ఎనిమిది ప్యాకేజీలుగా విభజించిన ఈ ఆరోగ్య మహిళ కార్యక్రమంలో డయాగ్నోస్టిక్స్, క్యాన్సర్ స్క్రీనింగ్, సరైన ఆహరం లేకుంటే వచ్చే సమస్యలు, మూత్ర సంబంధిత సమస్యలు, మోనోపాజ్ సంబంధిత, కుటుంబ నియంత్రణ, ఇన్ఫర్టిలిటీ, మెస్ట్రువల్ సమస్యలు, సుఖ వ్యాధులు, తక్కువ బరువు ఉన్న సమస్యలకు సంబందించిన వైద్య పరీక్షలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన మొత్తం 20 పాథాలజికల్ లాబ్ లలో నిర్వహిస్తారని తెలిపారు. వీటితోపాటుగా బీపీ, షుగర్, అనీమియా పరీక్షలను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తారని, ఈ పరీక్షల రిపోర్టులను 24 గంటలలోపే అందచేస్తారన్నారు. మహిళలలో క్యాన్సర్ వ్యాధి అవకాశాలు ఎక్కువగా ఉండడంతో, మహిళలలో క్యాన్సర్ వ్యాధికి నిర్దారణ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

ఈ ఆరోగ్య మహిళ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలలో 30 ఏళ్ల పైబడ్డ మహిళలకు బ్రీస్ట్ క్యాన్సర్ నిర్దారణ పరీక్షలు చేపడుతారని తెలిపారు. జిల్లా కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రులలో మామోగ్రామ్. కల్పోస్కోపి, క్రియోథెరపి, బయాప్సి, పాప్ స్మియర్ పరీక్షలను నిర్వహిస్తారని, హైదరాబాదులోని నిమ్స్, ఎం.ఎం.జె క్యాన్సర్ ఆసుపత్రుల్లో నిర్దారిత క్యాన్సర్ మహిళలకు చికిత్స అందిస్తారని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని మహిళలకు అయిడిన్ లోపం (థైరాయిడ్ ), విటమిన్ డీ-3, బీ-12 తదితర వైద్య పరీక్షలను అవసరం ఉన్నవారికి నిర్వహించనున్నారు. మూత్ర సంబంధిత వ్యాధులను ఎదుర్కునే మహిళలలకు రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలలో ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. అదేవిధంగా మోనోపాజ్, మేనుస్ట్రేషన్, కుటుంబ నియంత్రణ, సంతాన లేమి తదితర సమస్యలకు కూడా పరీక్షలు నిర్వహించి కౌన్సిలింగ్ చేపడుతారన్నారు. అవసరమున్నవారికి ఆల్ట్రా సౌండ్ పరీక్షలకు జిల్లా కేంద్రాలకు రెఫర్ చేస్తారు. సుఖ వ్యాధులు, తక్కువ బరువు తదితర సమస్యలకు కూడా వైద్య పరీక్షలు, కౌన్సిలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి గాను ప్రత్యేకంగా ఆరోగ్య మహిళా హెల్ప్ డెస్క్లు కియాస్కి లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద ఏ.ఎన్.ఎం , ఆశా వర్కర్ లతో పాటు పేషంట్ కేర్ కార్యకర్తలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రేపు (మార్చి 8, బుధవారం) తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − five =