తెలంగాణలో స్కూల్స్ ప్రారంభం అయి మూడు రోజులు గడిచిపోయాయి. మామూలుగా అయితే విద్యార్థులంతా పుస్తకాలకు అట్టలు వేసుకుని, నీటుగా పేరు రాసుకుని చదువు కోసం పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం అలాంటి సీన్ కనిపించలేదు. పుస్తకాలు లేకుండానే స్టూడెంట్స్ అంతా స్కూల్స్ కు వెళ్లి వస్తుండగా.. టీచర్లంతా పుస్తకాలు ముందేసుకుని వాటితో కుస్తీ పడుతున్నారు. పిల్లల ముందు ఉండాల్సిన పుస్తకాలు ఇప్పుడు ఉపాధ్యాయుల ముందే ఉన్నాయి. దీనికి కారణం విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం. అవును ..అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాఠ్య పుస్తకాల ముద్రణలో తప్పులు దొర్లాయి. దీంతో పాఠశాల ప్రారంభమై మూడు రోజులు గడస్తున్నా సరే విద్యార్థులకు ఇంకా పుస్తకాలు అందలేదు.
ఇప్పటికే పిల్లలందరికీ పుస్తకాలు పంచి.. పాఠాలు ప్రారంభించాల్సిన ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు ఇప్పుడు పుస్తకాల్లోని పేజీలు చించుతూ బిజీగా ఉన్నారు. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా పంపిణీ చేసే పుస్తకాల్లో ముందుమాటగా ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి సందేశాన్ని ముద్రించడం కొన్నాళ్లుగా అనవాయితీగా వస్తోంది. కానీ అధికారుల నిర్లక్ష్యం వ్యవహరించడం వల్ల ముందుమాటలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బదులుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును ముద్రించారు. చివరకు కొంతమంది విద్యార్ధులకు పుస్తకాలు పంచాక..ఆ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో టీచర్లు, అధికారులు నాలుక కరుచుకున్నారు.
దీంతో ఆ ముందుమాట పేజీని చించేసి.. అదే స్థానంలో కొత్తగా ముద్రించిన సీఎం రేవంత్ రెడ్డి పేరుతో ఉన్న ముందుమాట పేజీని అతికించాలని అన్ని జిల్లాల డీఈవోలకు తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అన్ని పాఠశాలల్లో టీచర్లంతా కూర్చొని.. పుస్తకాల్లో ముందుమాట పేజీను చించి వాటి స్థానంలో కొత్తగా ప్రింట్ చేసిన పేజీలను అతికించే పనిలో పడ్డారు. ఇటు మూడు రోజుల నుంచి స్కూల్స్‌కు వెళుతున్న విద్యార్థులు.. పాఠాలు వినకుండానే ఇంటి బాట పడుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ