ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ భారత పౌరసత్వం రద్దు

Central Government Cancels Indian Citizenship Of TRS MLA, Central Government Cancels Indian Citizenship Of TRS MLA Ramesh, Indian Citizenship Of TRS MLA Ramesh, latest political breaking news, MHA Cancels Telangana TRS MLA Chennamaneni Ramesh’s Citizenship, national news headlines today, national news updates 2019, Political Updates 2019, Telangana Breaking News, Telangana Political Updates, Telangana Political Updates 2019, Telangana TRS MLA Chennamaneni Ramesh’s Citizenship

తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ భారత పౌరసత్వాన్ని రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత పౌరసత్వానికి ఆయన అనర్హుడని కేంద్ర హోంశాఖ స్పష్టం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల జేసింది. భారత పౌరసత్వాన్ని పొందేందుకు చెన్నమనేని రమేశ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని హోంశాఖ పేర్కొంది. చెన్నమనేని రమేశ్‌ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్‌ నేత ఆది శ్రీనివాస్‌ 2009 నుంచి పోరాటం చేస్తున్నారు. ఈ అంశంపై చాలాకాలంగా కోర్టుల్లో విచారణ జరుగుతూ వస్తుంది. చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వంపై ముందుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు, ఆ తర్వాత తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పౌరసత్వంపై కేవలం కేంద్ర హోంశాఖ మాత్రమే నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుందని హైకోర్టు విచారణలో స్పష్టం చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. పలు విచారణల అనంతరం రమేశ్‌ పౌరసత్వంపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంశాఖకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి విచారణ చేపట్టిన కేంద్ర హోంశాఖ కాంగ్రెస్‌ నేత ఆది శ్రీనివాస్‌ తో పాటు, చెన్నమనేని రమేశ్‌ నుంచి పూర్తి వివరాలు సేకరించి పరిశీలించాక పౌరసత్వాన్ని రద్దు చేస్తునట్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

తన భారత పౌరసత్వాన్ని రద్దు చేయడంపై చెన్నమనేని రమేశ్‌ స్పందిస్తూ, మరోమారు హైకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. జూలై 15న ఈ అంశంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కేంద్ర హోంశాఖ పరిగణనలోకి తీసుకోకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు. తన పౌరసత్వాన్ని 2017లో హోంశాఖ రద్దు చేసిన తరువాత హైకోర్టు వెంటనే స్టే మంజూరు చేసిందని, సుదీర్ఘ వాదనల తర్వాత గత జూలై 15న పౌరసత్వాన్ని రద్దు చేయడాన్ని హైకోర్టు కొట్టివేసిందని చెప్పారు. పౌరసత్వాన్ని పరిరక్షించుకునేందుకు మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తానని, తప్పకుండా న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని చెన్నమనేని రమేశ్ పేర్కొన్నారు. 2009లో టీడీపీ నుంచి వేములవాడ ఎమ్మెల్యేగా ఎన్నికైన రమేశ్‌, ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 2010లో జరిగిన ఉప ఎన్నికతో పాటు 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. చెన్నమనేని రమేశ్ 1993లో జర్మనీ పౌరసత్వాన్ని స్వీకరించారు, అనంతరం 2008 మార్చిలో భారతదేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. రమేశ్ భారత పౌరసత్వం రద్దు చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించిన నేపథ్యంలో, ఆయన ఎమ్మెల్యే పదవిలో కొనసాగడంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 7 =