తెలంగాణలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన చింతపండు నవీన్( తీన్మాన్ మల్లన్న) గెలుపొందారు. తన ప్రత్యర్థిపై 22 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. జనగాం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. ఈక్రమంలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రలు నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది.
మే 27న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది. ఈసారి మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ తరుపున తీన్మార్ మల్లన్న బరిలోకి దిగగా.. బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరి మధ్యే ఈసారి గట్టి పోరు సాగింది. సార్వత్రిక ఎన్నికల సమారానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉప ఎన్నిక జరిగింది. బ్యాలెట్ విధానంలో జరిగిన ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 4.63 లక్షల మంది పట్ట భద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈనెల 5న మొదలయి రెండు రోజుల పాటు సాగింది.
మొదట ప్రాధాన్యత ఓట్లను మూడు రౌండ్లలో లెక్కించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో మొత్తం 2,64,216 ఓట్లను అర్హమైనవిగా అధికారులు గుర్తించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు. ఆయనకు 1,06,234 ఓట్లు పడగా.. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 87,356 ఓట్లు.. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి 34,516 ఓట్లు పోలయ్యాయి. గెలుపు టార్గెట్ కోటా అయిన 1,55,095 ఓట్లు ఎవరికీ రాలేదు. ఈక్రమంలో రెండో ప్రాధాన్యత ఓట్లలో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్ చేసి వారికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను మిగిలిన అభ్యర్థులకు కలుపుతూ లెక్కించారు. మొత్తం 48 మందిని ఎలిమినేట్ చేశాక.. తీన్మార్ మల్లన్నకు 1,24,899 ఓట్లు.. రాకేష్ రెడ్డికి 1,05,524 ఓట్లు.. ప్రేమేందర్ రెడ్డికి 43,096 ఓట్లు వచ్చాయి.
అయినప్పటికీ గెలుపు కోటా ఓట్లు ఎవరికీ రాకపోవడంతో.. మూడో స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని ఎలిమినేట్ చేసి ఓట్లు లెక్కించారు. ఆ తర్వాత కూడా మిగిలిన ఇద్దరు అభ్యర్థులు గెలుపు కోటా ఓట్లకు చేరు కోలేదు. దీంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం అత్యధిక ఓట్లు పొందిన కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను రిటర్నింగ్ అధికారి హరిచందన ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY