తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం సభ ప్రారంభమవ్వానే కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపంగా ముఖ్యమంత్రి రేవంత రెడ్డి తీర్మానంను ప్రవేశ పెట్టారు. లాస్య నందిత తండ్రి సాయన్న తనకు అత్యంత సన్నిహితులు, ఆప్తులు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చాలా సంవత్సరాలు సాయన్నతో కలిసి పని చేశానని వెల్లడించారు. కంటోన్మెంట్‌ను అభివృద్ధి చేయడానికి ఆయన ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తన సాయన్న మరణించడంతో తండ్రి వారసత్వాన్ని, బాధ్యతలను నెరవేర్చేందుకు ఆయన కుమార్తె లాస్య నందిత ప్రజాజీవితంలోకి వచ్చారని వెల్లడించారు.
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కంటోన్మెంట్ ప్రజలు, మహిళల తరఫున లాస్య నందిత చిత్తశుద్ధితో పోరాడతారని భావించామని… కానీ దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారని అన్నారు. కంటోన్మెంట్ ప్రజల హృదయాల్లో సాయన్న, లాస్య నందిత శాశ్వతంగా నిలిచిపోతారని పేర్కొన్నారు. వారిద్దరు చేయాలనుకున్న పనులను తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు. అలాగే వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.
మరోవైపు మంగళవారం సభ ముగిసిన తర్వాత బీఏసీ మీటింగ్ జరిగింది. అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌ను ఈ మీటింగ్‌లో ఖరారు చేశారు. ఈనెల 31 వరకు.. మొత్తం 8 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క జూలై 25న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. జూలై 31న ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE