గోవిందరావు పేటలో స్వర్గీయ వీరపనేని శివాజీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

Minister Errabelli Dayakar Rao Inaugurates Late Sri Veerapaneni Sivaji Garu Statue at Govindaraopet,Minister Errabelli Dayakar Rao,Late Sri Veerapaneni Sivaji Garu Statue,Govindaraopet,Mango News,Mango News Telugu,Sri Veerapaneni Sivaji Garu Statue at Govindaraopet,Sri Veerapaneni Sivaji,Veerapaneni Sivaji Late,Late Veerapaneni Sivaji,Errabelli Dayakar Rao Latest News And Updates,Former Mango Managing Director,Former Mango MD Late Veerapaneni Sivaji Garu,Veerapaneni Sivaji Garu,Veerapaneni Sivaji,Veerapaneni Sivaji Statue

తెలంగాణలోని ములుగు జిల్లా, గోవిందరావు పేట గ్రామంలో స్వర్గీయ వీరపనేని శివాజీ గారి విగ్రహాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించారు. ఈ రోజు జరిగిన (నవంబర్ 21, సోమవారం) వీరపనేని శివాజీ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరవగా, వీరపనేని భాగ్యలక్ష్మి, మ్యాంగో మాస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ రామ్ వీరపనేని, ఆయన సతీమణి, ప్రముఖ గాయని సునీత, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి, ములుగు కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు. అలాగే గోవిందరావు పేట గ్రామంలో వీరపనేని శివాజీ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబసభ్యులు దాతలుగా వ్యవహరిస్తూ అత్యాధునిక వసతులు, అన్ని సదుపాయాలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ అండ్ కమ్యూనిటీ హాల్ ను ఇతర ప్రముఖులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు.

అనంతరం “సలాములయ్య” పేరుతో రూపొందించిన వీరపనేని శివాజీ గారి స్మృతి గీతాల ఆల్బమ్ ను కూడా మంత్రి ఎర్రబెల్లి లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, సంబంధితులు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలను కొద్దిసేపు గాయని సునీత తన పాటలతో అలరించారు. గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయంతో పాటుగా శుభకార్యాలు, సమావేశాల నిమిత్తం కమ్యూనిటీ హాల్ కూడా అందుబాటులోకి రావడంతో గోవిందరావు పేట ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు స్వర్గీయ వీరపనేని శివాజీ గారి విగ్రహా ఆవిష్కరణ సందర్భంగా గ్రామ ప్రజలకు భారీ విందు కార్యక్రమం కూడా కూడా ఏర్పాటు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − four =