తెలంగాణ బడ్జెట్ 2025 హైలెట్స్ ఇవే.. ఆరోగ్య, విద్య, సంక్షేమానికి భారీ కేటాయింపులు!

తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్‌ను సభలో సమర్పించారు. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా ఆరోగ్య, విద్య, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చింది.

ఆరోగ్య రంగానికి భారీ కేటాయింపులు

ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు ప్రభుత్వం పెంచింది. కొత్తగా 1,835 వైద్య చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చారు. ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ఖర్చును 20 శాతం పెంచారు. ఈ పథకం కోసం రూ.1,143 కోట్లు కేటాయించారు. వైద్య రంగానికి మొత్తం రూ.12,393 కోట్లు కేటాయించారు. ఉచిత వైద్యం, వైద్య కళాశాలల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు.

హైదరాబాద్ అభివృద్ధి & గ్లోబల్ సిటీ లక్ష్యం

హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చడమే లక్ష్యం.

విద్య రంగానికి నూతన మార్పులు

ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు. ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ ఉచితంగా అందించనున్న ప్రభుత్వం. గురుకులాలకు డైట్ ఛార్జీలు 40%, కాస్మోటిక్ ఛార్జీలు 200% పెంపు. విద్యార్థులకు ఉచితంగా సాయంత్రం స్నాక్స్ పథకం. ఏఐ సిటీగా 200 ఎకరాల్లో ప్రత్యేక టెక్ హబ్ ఏర్పాటు. ముచ్చర్లలో యంగ్ ఇండియా టెక్నికల్ యూనివర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం. పాఠశాలల్లో గ్రీన్ ఎనర్జీ కోసం సౌర విద్యుత్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు.

రెవెన్యూ & వ్యయ వివరాలు

2024-25లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లు.

రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు.

మూల వ్యయం రూ.36,504 కోట్లు.

శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు

రైతు భరోసా: రూ.18,000 కోట్లు

వ్యవసాయ శాఖ: రూ.24,439 కోట్లు

పశుసంవర్థక శాఖ: రూ.1,674 కోట్లు

పౌర సరఫరాల శాఖ: రూ.5,734 కోట్లు

విద్య: రూ.23,108 కోట్లు

ఉపాధి కల్పన: రూ.900 కోట్లు

పంచాయతీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి: రూ.31,605 కోట్లు

స్త్రీ, శిశు సంక్షేమం: రూ.2,861 కోట్లు

ఎస్సీ సంక్షేమం: రూ.40,232 కోట్లు

ఎస్టీ సంక్షేమం: రూ.17,169 కోట్లు

బీసీ సంక్షేమం: రూ.11,405 కోట్లు

మైనార్టీ సంక్షేమం: రూ.3,591 కోట్లు

చేనేత: రూ.371 కోట్లు

ఐటీ: రూ.774 కోట్లు

మహిళా, శిశు సంక్షేమం: రూ.2,862 కోట్లు

హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్: రూ.150 కోట్లు

పారిశ్రామిక రంగం: రూ.3,525 కోట్లు

విద్యుత్: రూ.21,221 కోట్లు

వైద్యారోగ్యం: రూ.12,393 కోట్లు

పురపాలక, పట్టణాభివృద్ధి: రూ.17,677 కోట్లు

నీటిపారుదల: రూ.23,373 కోట్లు

ఆర్ అండ్ బీ: రూ.5,907 కోట్లు

పర్యాటక రంగం: రూ.775 కోట్లు

సాంస్కృతిక రంగం: రూ.465 కోట్లు

అడవులు-పర్యావరణం: రూ.1,023 కోట్లు

దేవాదాయ, ధర్మాదాయ శాఖ: రూ.190 కోట్లు

శాంతిభద్రతలు: రూ.10,188 కోట్లు

ఇందిరమ్మ ఇళ్లకు: రూ.22,500 కోట్లు

ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు, మొత్తం 4.50 లక్షల ఇళ్లు

హోంశాఖ: రూ.10,188 కోట్లు

క్రీడలు: రూ.465 కోట్లు

గృహజ్యోతి & ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్: రూ.3,000 కోట్లు

ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసం: రూ.11,600 కోట్లు

మొత్తం బడ్జెట్ సమీక్ష

ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా ఆరోగ్య, విద్య, రైతు సంక్షేమం, పట్టణాభివృద్ధి, పారిశ్రామిక రంగాలకు అధిక నిధులను కేటాయించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిన బడ్జెట్‌గా ఇది నిలిచింది.