రాష్ట్రంలో పోడు భూముల సమస్యకి శాశ్వత పరిష్కారం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన మంత్రులు ఇంద్ర కరణ్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, అజయ్ కుమార్ తో కేబినెట్ సబ్ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ కేబినెట్ సబ్ కమిటీ రెండో సమావేశం బూర్గుల రామకృష్ణారావు భవన్ లో శుక్రవారం నాడు జరిగింది. ఇతర రాష్ట్రాల్లో పోడు భూముల సమస్య-పరిష్కారం, తెలంగాణలో జిల్లాల వారీగా పోడు భూముల వివరాలు, గిరిజనులు, గిరిజనేతరులు సాగు చేస్తున్న పోడుపై ఈ కమిటీ చర్చించింది. ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా, అటవీ శాఖ పిసిసీఎఫ్ శోభ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ