తెలంగాణలో కరోనా : కొత్తగా 357 పాజిటివ్ కేసులు నమోదు

Telangana Covid-19 Updates: 357 New Positive Cases, 405 Recoveries Reported Today

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 357 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆగస్టు 26, గురువారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,56,455 కి చేరింది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరోకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 3,865 కి పెరిగింది. కొత్తగా 405 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి 6,46,344 కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 96, కరీంనగర్ లో 33, మేడ్చల్-మల్కాజ్ గిరిలో 23, వరంగల్ అర్బన్ లో 21, నల్గొండలో 21 నమోదయ్యాయి.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు (ఆగస్టు 26, సాయంత్రం 5.30 గంటల వరకు):

  • రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 2,42,66,647
  • రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 6,56,455
  • కొత్తగా నమోదైన కేసులు : 357
  • నమోదైన మరణాలు : 1
  • రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 6,46,344
  • కరోనా రికవరీ రేటు: 98.45%
  • యాక్టీవ్ కేసులు: 6,246
  • నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 3,865
  • కరోనా మరణాల రేటు: 0.58%
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ