సుప్రీంకోర్టు జడ్జిలుగా 9 మంది నియామకానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం

Mango News, Nine Judges to the Supreme Court, Nine new judges appointed to SC, Nine new judges appointed to Supreme Court, President Kovind appoints nine new judges, President notifies appointment of nine Supreme Court judges, President Ram Nath Kovind, President Ram Nath Kovind Notified the Appointment of Nine Judges to the Supreme Court, Ram Nath Kovind, SC gets nine judges after two years, Supreme Court, Supreme Court Gets 9 New Judges

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవలే సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులుగా(జడ్జిలు) నియామకం కోసం తొమ్మిదిమంది పేర్లను సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు గురువారం నాడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ముగ్గురు హైకోర్టు మహిళా జడ్జిలు సహా మొత్తం తొమ్మిది మంది సుప్రీంకోర్టు జడ్జిలుగా ఆగస్టు 31న ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తుంది. తాజా నియమాకాలతో సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య 33కు చేరగా, ఇంకా ఒక ఖాళీ మాత్రమే ఉండనుంది. మరోవైపు సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులైన జస్టిస్ బీవీ నాగరత్న భవిష్యత్తులో భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమితులైన వారి వివరాలు:

  • జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓకా – చీఫ్ జస్టిస్ కర్ణాటక హైకోర్టు
  • జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ – చీఫ్ జస్టిస్ గుజరాత్ హైకోర్టు
  • జస్టిస్‌ జేకే మహేశ్వరి – చీఫ్ జస్టిస్ సిక్కిం హైకోర్టు
  • జస్టిస్‌ హిమా కోహ్లి – చీఫ్ జస్టిస్ తెలంగాణ హైకోర్టు
  • జస్టిస్‌ బీవీ నాగరత్న – జడ్జి కర్ణాటక హైకోర్టు
  • జస్టిస్‌ సీటీ రవికుమార్‌ – జడ్జి కేరళ హైకోర్టు
  • జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌ – జడ్జి మద్రాస్ హైకోర్టు
  • జస్టిస్‌ బేలా ఎం.త్రివేది – జడ్జి గుజరాత్ హైకోర్టు
  • పీఎస్‌ నరసింహ – సీనియర్ అడ్వకేట్
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 7 =