రాష్ట్రంలో కోవిడ్ బెడ్స్ సంఖ్యను 18 వేల నుండి 52 వేలకు పెంచాం: సీఎస్

Telangana CS Somesh Kumar Press Meet over Covid Situation in the State,Mango News,Mango News Telugu,Telangana CS Somesh Kumar,CS Somesh Kumar,Somesh Kumar,Telangana CS Somesh Kumar Live,CS Somesh Kumar Live News,CS Somesh Kumar Live Updates,CS Somesh Kumar Pressmeet Live,CS Somesh Kumar Pressmeet,CS Somesh Kumar Latest News,CS Somesh Kumar News,Telangana CS Press Meet,Covid Situation,CS Somesh Kumar Press Meet over Covid Situation,CS Somesh Kumar Meet,CS Somesh Kumar On Covid Situation,Somesh Kumar Reviews Covid-19 Situation In Telangana,Covid-19,Covid-19 In Telangana,Telangana Covid-19 Updates,Telangana Coronavirus Latest Updates,Telangana CS Somesh Kumar Live,Telangana CS Somesh Kumar Pressmeet Live

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలు, మార్గ నిర్దేశనం మేరకు ప్రభుత్వ యంత్రాంగం కోవిడ్ నియంత్రణకు కృషి చేస్తున్నదని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో పరిస్థితి నియంత్రణలో ఉందని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. బుధవారం నాడు ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లు, డిఎం అండ్ హెచ్.ఓ లతో టెలీ-కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణలో ఉంది:

సీఎం కేసీఆర్ ప్రతి రోజు నిరంతరం ఆదేశాలు జారీ చేస్తున్నారని, అవసరమైన నిధుల ఖర్చుకు ఆదేశాలు జారీ చేశారని. అవసరమైన మందులు, కిట్లు అందుబాటులో ఉన్నాయని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ప్రజలు అవసరమైతేనే బయటకు వెళ్లాలని స్వీయ జాగ్రత్తలు పాటించాలని కోరారు. రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణలో ఉందని, ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులు, పి.హెచ్.సి లు, సబ్ సెంటర్లు, బస్తీ దవాఖానాలలో కోవిడ్ అవుట్ పేషెంట్ ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కోవిడ్ లక్షణాలు వున్నట్లు అనిపించిన వెంటనే మందుల వాడకాన్ని ప్రారంభించాలని, మెడికల్ కిట్లను వినియోగించాలని, 4,5 రోజుల తర్వాత కూడా జ్వరం తగ్గక పోతే, కిట్ లో వున్న స్టేరాయిడ్ లు వాడాలని సీఎస్ అన్నారు.

లక్షణాలు వున్న ప్రజలకు ఇళ్లవద్దనే మెడికల్ కిట్లను అందిస్తాం:

జీహెఛ్ఎంసీ తరహా లోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటిలో ప్రతి 1000 జనాబాకు ఒక టీం ప్రజల ఇండ్ల వద్దకు వెళ్లి అవుట్ రీచ్ కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. లక్షణాలు వున్న ప్రజలకు అక్కడిక్కడే మెడికల్ కిట్లను అందచేస్తారని అన్నారు. ఈ టీంలు వారి ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేస్తాయని అన్నారు. అన్ని శాఖల అధికారులు, ఒక టీం వర్క్ లాగా పనిచేసి కోవిడ్ నియంత్రణకు కృషి చేస్తున్నారని, గత వారం రోజుల ట్రేండ్ ను పరిశీలిస్తే తగ్గుదల కనిపిస్తున్నదని, ప్రజలలో విశ్వాసం పెరిగేలా మీడియా కృషి చేయాలని కోరారు. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం లక్షణాలు కన్పించిన వెంటనే మందుల వినియోగం ప్రారంభించటం వల్ల ఆసుపత్రులలో చేరే అవకాశాలు తగ్గుతాయన్నారు. చికిత్సను జాప్యం లేకుండా తీసుకోవాలన్నారు.

రాష్ట్రంలో పడకల సంఖ్యను 18 వేల నుండి 52 వేలకు పెంచాం:

రాష్ట్రంలో వైద్య సిబ్బంది కొరత లేకుండా నియమకాల ప్రక్రియ ను చేపడుతున్నామన్నారు. ఆసుపత్రులలో పడకల సంఖ్యను పెంచామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పడకల సంఖ్యను 18 వేల నుండి 52 వేలకు పెంచామన్నారు. ఆసుపత్రులలో పరిశుభ్రతతో పాటు తగినంత వెలుతురు ఉండడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించామని తెలిపారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా సిబ్బంది నియమకాలకు కలెక్టర్లకు అనుమతినిచ్చామన్నారు. ఆక్సిజన్ ను వృధా చేయకుండా, ఆసుపత్రులలో ఆడిట్ తో పాటు అధికారులు, టీంలు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసామన్నారు. ఆక్సిజన్ ను అవసరమైన మేరకే వాడుకోవాలని, రాష్ట్ర అవసరాల మేరకు ఆక్సిజన్ సరఫరా చేసేలా నిరంతరం కేంద్ర ప్రభుత్వం తో సంప్రదిస్తున్నామన్నారు. డీలర్లు, సరఫరాదారులపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామన్నారు. ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశంలోనే మొదటిసారిగా రవాణలో జాప్యాన్ని నివారించడానికి వాయుమార్గం ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్లను పంపామని, ఇప్పటివరకు 14 ట్రిప్పుల ద్వారా 48 ట్యాంకర్లు పంపామని , రైల్వే ర్యాక్ లు కూడా వినియోగించామని తెలిపారు.

45 సంవత్సరాలలోపు వారికి కరోనా వ్యాక్సినేషన్ పై సీఎం కేసీఆర్ విధానపరమైన నిర్ణయం:

45 సంవత్సరములు పైబడిన వారికి వ్యాక్సినేషన్ కోసం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్ళాలన్నారు. జిల్లా అసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల మధ్య సమన్వయం ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి వ్యాక్సిన్ల సరఫరా కనుగుణంగా 45 సంవత్సరాలలోపు వారికి వ్యాక్సినేషన్ పై సీఎం కేసీఆర్ విధానపరమైన నిర్ణయం తీసుకుంటారన్నారు. రాష్ట్రానికి రెమిడెసివిర్ ను అధికంగా కేటాయించాలని కోరామన్నారు. రాష్ట్ర అవసరాల మేరకు మందులు, టెస్టింగ్ కిట్లు, పీపీఈ కిట్లు, మాస్కులు అందుబాటులో వున్నాయన్నారు. జిల్లాలలోను కాల్ సెంటర్లు పనిచేస్తున్నాయని ప్రజలు వాటిని వినియోగించుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల నుండి కూడా పేషంట్లు చికిత్స కోసం వస్తున్నారని , హైదరాబాద్ మెడికల్ ట్రీట్ మెంట్ క్యాపిటల్ గా మారిందని గత 15 రోజులల్లో ఇతర రాష్ట్రాలతో పాటు ఢిల్లీ నుండి 33 మెడికల్ అంబులెన్స్ లు చికిత్స కోసం వచ్చాయన్నారు. ఈ మీడియా సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి మరియు సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ అర్వింద్ కుమార్, వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వి, ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ డా.జి.శ్రీనివాస రావు మరియు వైద్య విద్య డైరెక్టర్ డా.రమేశ్ రెడ్డిలు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ