3.87 లక్షల కుటుంబాలకు 387.90 కోట్లు పంపిణీ, అందని వారికీ మళ్ళీ నగదు పంపిణీ: సీఎస్

Financial Assistance to Flood Victims, Financial Assistance to Hyderabad Flood Victims, Flood victims in Hyderabad, Hyderabad Flood Victims, Hyderabad rain victims, Somesh Kumar, Somesh Kumar Review over Financial Assistance, Telangana CS, Telangana CS Somesh Kumar, Telangana CS Somesh Kumar Review, telangana government

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వరద బాధిత, ప్రభావిత కుటుంబాలకు నగదు పంపిణీపై మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జిహెచ్ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్ లతో ఆదివారం నాడు బి.ఆర్.కె.ఆర్. భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ నుండి మునిసిపల్ శాఖకు వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయ, పునరావాస, ఆర్ధిక సహాయం కోసం 550 కోట్ల రూపాయలు మంజూరు చేయగా, ఇప్పటి వరకు వరదలతో నష్టపోయిన 3.87 లక్షల కుటుంబాలకు 387.90 కోట్లు పంపిణీ చేయడం జరిగిందని సీఎస్ తెలిపారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా వరద ముంపుకు గురై, మిగిలిన అర్హత కలిగిన కుటుంబాలకు ఆర్ధిక సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని మరలా కొనసాగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

వరద ప్రభావిత కుటుంబాలకు నగదు పంపిణీ కోసం అవసరమైన షెడ్యూల్ ను రూపొందించాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి మరియు జిహెచ్ఎంసి కమీషనర్ లను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. వరదలతో నష్టపోయి ఇప్పటి వరకు నగదు సహాయం అందని ప్రభావిత కుటుంబాలకు వారి ఇంటి వద్దే నగదు సహాయ పంపిణిని చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ