బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సస్పెన్షన్‌ అనంతరం అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితి

BJP MLA Etela Rajender Responds Over Suspension From Telangana Assembly Session, MLA Etela Rajender Suspended From Assembly, Tension Prevails After Etala Rajendra Suspension, BJP MLA Eatala Rajender, MLA Eatala Rajender Suspended from Assembly, Huzurabad BJP MLA Eatala Rajender , Huzurabad BJP MLA, Mango News, Mango News Telugu, MLA Eatala Rajender, Eatala Rajender Suspended from Assembly, Eatala Rajender Assembly Suspension, BJP Party, TRS Party, Telangana Assembly, Telangna Assembly Sessions, Telangana Assembly Live Updates, Telangana Assembly Live News

తెలంగాణ శాసనసభ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సస్పెండ్‌ అయిన సంగతి తెలిసిందే. ఆయనపై ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్‌ వేటు వేసినట్లు స్పీకర్ పోచారం ప్రకటించారు. సభాపతిపై ఈటల చేసిన వ్యాఖ్యలపై ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని అధికారపార్టీ సభ్యులు డిమాండ్ చేయగా, ఈటల నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో సభ నుంచి బయటకు వచ్చిన ఈటలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆయన వాహనంలోకి ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. తన సొంత వాహనంలో బయటకు వెళతానని బీజేపీ ఎమ్మెల్యే చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. దీంతో పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది.  తనను అరెస్ట్‌ చేస్తున్నారా అంటూ పోలీసులను ప్రశ్నించిన ఆయన, బానిసలా వ్యవహరించవద్దు అంటూ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ లో మళ్ళీ గెలిచినప్పటి నుంచీ ఇప్పటి వరకు తనను అసెంబ్లీకి హాజరు కాకుండా చేస్తున్నారని, ప్రజల సమస్యలు వినిపించే ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడనని, కేసీఆర్‌ను గద్దె దించే వరకు విశ్రమించనని ఈటల స్పష్టం చేశారు. అనంతరం ఈటల రాజేందర్‌ను బలవంతంగా పోలీస్‌ వాహనంలోకి ఎక్కించి శాసనసభ నుంచి శామీర్‌పేట్‌లోని ఆయన నివాసానికి తరలించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 6 =