తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలను పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో అకడమిక్ క్యాలెండర్ ను శనివారం నాడు తెలంగాణ విద్యా శాఖ విడుదల చేసింది. 2021-22 సంవత్సరానికి గానూ మొత్తం 213 రోజులును పని దినాలుగా నిర్ణయించారు. ఇందులో 166 రోజుల పాటు ప్రత్యక్ష తరగతులు జరగనుండగా, 47 రోజుల ఆన్‌లైన్ తరగతులను పరిగణనలోకి తీసుకున్నారు.
ఇక పదో తరగతి సిలబస్ ను జనవరి 10, 2022 లోగా పూర్తి చేయనున్నారు. ఇక పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి, ఫైనల్ పబ్లిక్ పరీక్షలను మార్చి/ఏప్రిల్ నెలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక అన్ని తరగతుల విద్యార్థులకు కూడా ఏప్రిల్ 23 లోపే పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 2021-22 విద్యాసంవత్సరం ఏప్రిల్ 23, 2022తో (చివరిపనిదినం) ముగుస్తుందని తెలిపారు.
సెలవుల వివరాలు:
- దసరా సెలవులు : అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 17వరకు
- క్రిస్మస్ సెలవులు (మిషనరీ పాఠశాలలకు) : డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు
- సంక్రాంతి సెలవులు : జనవరి 11 నుంచి జనవరి 16 వరకు
- వేసవి సెలవులు : ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ






































