నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరైన మాజీ మంత్రి గీతారెడ్డి

Telangana Ex Minister Geetha Reddy Attends at ED Office For The Inquiry of National Herald Case Today, Telangana Ex Minister Geetha Reddy, Geetha Reddy Attends at ED Office, Geetha Reddy of National Herald Case Today, Mango News, Mango News Telugu, Directorate of Enforcement, Enforcement Directorate, Enforcement Directorate Hyd, Enforcement Directorate , Enforcement Directorate Recruitment, Token App Case Paytm, Paytm Token Case, Directorate of Enforcement

నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన కేసు కాంగ్రెస్ నాయకులను వదలడం లేదు. ఇప్పటికే దీనిలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రోజుల తరబడి విచారించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో దీనికి సంబంధించి యంగ్ ఇండియా లిమిటెడ్ సంస్థకు విరాళాలు ఇచ్చిన వారిపై ఈడీ తాజాగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు కూడా విరాళాలు ఇచ్చినట్లుగా గుర్తించిన ఈడీ, ఐదుగురు సీనియర్ నేతలకు నోటీసులు జారీ చేసింది.

వీరిలో గీతా రెడ్డి, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్‌ తదితరులు ఉన్నారు. అలాగే వీరితో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన పలువురు నేతలకు కూడా ఈడీ నోటీసులు అందజేసింది. ఈ క్రమంలో మాజీ మంత్రి గీతారెడ్డి నేడు ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఇక ఆమెతో పాటు గాలి అనిల్ కుమార్ కూడా ఈడీ ముందు హాజరయ్యారు. కాగా మరో సీనియర్ మంత్రి షబ్బీర్ అలీ ఈ నెల 3న ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY