ఆయుష్ వైద్యం పొందేందుకు విదేశీయులు సైతం వచ్చేలా నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రి ఎదుగాలి – మంత్రి హరీశ్‌ రావు

Minister Harish Rao Starts Developmental Works Worth of Rs.10 Cr in Nature Cure Hospital at Ameerpet Hyderabad,Minister Harish Rao Starts Developmental Works,Developmental Works Worth of Rs.10 Cr,Nature Cure Hospital at Ameerpet Hyderabad,Developmental Works in Nature Cure Hospital,Mango News,Mango News Telugu,Minister Harish Rao Inaugurating Renovated Facilities,Harish Rao Live,Telangana minister T Harish Rao,Minister Harish Rao Latest News and Updates,Nature Cure Hospital at Ameerpet News Today

ఆయుష్ వైద్యం పొందేందుకు విదేశీయులు సైతం ఇక్కడకు వచ్చేలా అమీర్‌పేటలోని నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రి ఎదగాలని ఆకాంక్షించారు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు. ఈ మేరకు ఆయన శనివారం హైదరాబాద్‌ సనత్ నగర్ పరిధిలోని అమీర్‌పేట నేచర్‌ క్యూర్ ఆస్పత్రిలో రూ.10 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక వసతులు, అభివృద్ధి పనులను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ.. ప్రకృతి వైద్యానికి తెలంగాణ కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచేలా కృషి చేయాలనే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష మేరకు సిబ్బంది పనిచేయాలని సూచించారు. హెల్త్‌హబ్ అయిన హైదరాబాద్‌లో చికిత్స పొందేందుకు దేశ విదేశాల నుంచి ఇక్కడికి పేషెంట్లు వస్తుంటారని, ఈ బాటలోనే ఆయుష్ వైద్యం పొందేందుకు సైతం వచ్చేలా నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రి ఎదగాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇక రూ.10 కోట్లతో ఈ ఆస్పత్రిని అభివృద్ధి చేసుకుంటున్నామని, మున్ముందు మరిన్ని నిధులు అందిస్తామని మంత్రి హరీశ్‌ రావు హామీ ఇచ్చారు.

కాగా సనాతన భారతీయ వైద్యాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలుగా పనిచేస్తున్నదని మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు. ప్రస్తుత యుగంలో తీవ్రమైన ఒత్తిడి, లైఫ్ స్టయిల్ డిసీజెస్, ఇతర ఆరోగ్య సమస్యలతో సతమతవుతున్నారని, అలాంటి వారికి నేచర్ క్యూర్ ఆస్పత్రిలో అద్భుతమైన చికిత్స అందిస్తారని తెలిపారు. ఇన్ పేషెంట్‌గా ఉన్నవారికి సైతం మంచి భోజనం ఇస్తారని, వారి రోగాలకు సంబంధించిన చికిత్సలో భాగంగా నూనెలు, మసాలాలు, ఉప్పు, కారాలు లేకుండా ప్రత్యేక ఆహారం పెడతారని వెల్లడించారు. భారతీయ వైద్య సిద్ధాంతం ప్రకారం.. ఆయుర్వేదం, నేచురోపతి, హోమియోపతి, యునాని, సిద్ధ, యోగా వంటి ప్రకృతి వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయని, ఇక్కడ నేచురోపతి, యోగా విధానాలు అందిస్తున్నారని తెలిపారు. కాగా నేచురోపతి అనేది పూర్తిగా డ్రగ్ లెస్ హీలింగ్ ప్రక్రియ అని, ఔషధ రూపంలో ఆహారాన్ని, యోగా, ప్రాణాయామంను శరీరానికి అందించడం దీని ప్రత్యేకతని, శరీరాన్ని పూర్తిగా డిటాక్సిఫికేషన్ చేయడం నేచర్ క్యూర్ విధానం అని మంత్రి హరీశ్‌ రావు వివరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 16 =