కోవిడ్ టీకా తీసుకున్న గవర్నర్ తమిళిసై భర్త డాక్టర్ పీ.సౌందరరాజన్

Covid Vaccine, Dr P Soundararajan Takes Covid Vaccine, Governor Tamilisai Husband Dr P Soundararajan, Mango News, Tamilisai Husband Dr P Soundararajan Takes Covid Vaccine, telangana, Telangana Corona Vaccination, Telangana Corona Vaccination Drive, Telangana Governor Tamilisai, Telangana Governor Tamilisai Husband Dr P Soundararajan, Telangana Governor Tamilisai Soundararajan, Telangana Guv congratulates her husband

దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొదటి విడతలో భాగంగా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో హెల్త్ కేర్ వర్కర్స్ కు కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భర్త డాక్టర్ పీ.సౌందరరాజన్ కరోనా టీకా తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ ట్వీట్ చేసి వివరాలు తెలియజేశారు. “వైద్యుడిగా, కోవిడ్ యోధులుగా సేవలందించి ఈరోజు తన వంతు రావడంతో కోవిడ్ టీకా తీసుకున్న నా జీవిత భాగస్వామి డాక్టర్ పీ.సౌందరరాజన్ గారికి శుభాకాంక్షలు. టీకా పట్ల అనవసర అపోహలు వద్దు. డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు అందరూ టీకా తీసుకోవాలని మనవి” అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ