తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) తాత్కాలిక ఛైర్మన్‌గా ప్రొఫెసర్ చింతా సాయిలు నియమితులు అయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత తాత్కాలిక ఛైర్మన్‌గా ఉన్న కృష్ణారెడ్డి పదవీకాలం మార్చి 18తో ముగిసింది. దీంతో టీఎస్‌పీఎస్సీలో సభ్యుడిగా ప్రస్తుతం సాయిలు ఒక్కరే ఉండడంతో ఆయనే తాత్కాలిక ఛైర్మన్‌గా నియమించబడ్డారు. టీఎస్‌పీఎస్సీకి పూర్తిస్థాయి ఛైర్మన్ నియామకం జరిగేవరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ముందుగా టీఎస్‌పీఎస్సీకి చైర్మన్ గా ఉన్న ఘంటా చక్రపాణి సహా సభ్యులు విఠల్, చంద్రావతి, మతీనుద్దీన్ ఖాద్రిల పదవీ కాలం డిసెంబర్ 17, 2020తో ముగిసిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ