తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు శనివారం తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నవీన్ మిట్టల్ ఇంటర్ బోర్డు కార్యదర్శిగా కొనసాగుతారని అందులో స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శిగా ఉన్న ఒమర్ జలీల్ ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనుండగా, ఆయన స్థానంలో నవీన్ మిట్టల్ అదనపు బాధ్యతలు తీసుకోనున్నారు. కాగా ప్రస్తుతం మిట్టల్.. తెలంగాణ కళాశాల విద్య, సాంకేతిక విద్యాశాఖలకు కమిషనర్‌గా కొనసాగుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY










































