తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ఆహార భద్రత కార్డులతోనూ ఆరోగ్యశ్రీ-ఆయుష్మాన్ భారత్ సేవలు

Telangana Govt Approves For The Food Security Card Holders Valid with Aarogyasri-Ayushman Bharat Scheme, TS Govt Approves For The Food Security Card Holders Valid with Aarogyasri-Ayushman Bharat Scheme, Food Security Card Holders Valid with Aarogyasri-Ayushman Bharat Scheme, Aarogyasri-Ayushman Bharat Scheme, Food Security Card Holders, Telangana Govt, Aarogyasri-Ayushman Bharat Scheme News, Aarogyasri-Ayushman Bharat Scheme Latest News And Updates, Aarogyasri-Ayushman Bharat Scheme Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ– ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద అందించే ఉచిత వైద్య చికిత్సలు ఆహారభద్రత కార్డుపై కూడా చెల్లుబాటయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే లబ్దిదారులకు గతంలో తెల్లరేషన్‌ కార్డు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం కింద కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందజేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రభుత్వం రేషన్‌ కోసం తెల్లకార్డుల స్థానంలో కొత్తగా 10లక్షల ఆహార భద్రత కార్డులను రెండు దఫాలుగా పంపిణీ చేసింది. కానీ వీటిని కేవలం రేషన్‌ కోసమే పరిమితం చేయడంతో ఆరోగ్యసేవల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కాగా ఆరోగ్యశ్రీ–ఆయుష్మాన్‌ భారత్‌ కింద సేవలు పొందాలంటే సంబంధిత కార్డు గానీ, లేదా తెల్ల రేషన్‌ కార్డు గానీ ఉండాలనే నిబంధన ఉండటంతో ఆహార భద్రత కార్డుదారులు ఆరోగ్యశ్రీ సేవలను పొందలేకపోతున్నారు. అయితే దీనిపై లబ్దిదారులనుంచి పెద్దఎత్తున వినతులు రావడంతో దీనిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. దీంతో ఆహార భద్రత కార్డుదారులకు కూడా ఇకపై ఆరోగ్యశ్రీ-ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద ఉచిత వైద్య సేవలు అందనున్నాయి. దీనిపై స్పందించిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కూడా ఇకనుంచి ఆహార భద్రత కార్డులను కూడా ఉచిత వైద్య సేవలకు అనుమతించాలని అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY