రాష్ట్రవ్యాప్తంగా 61 ఆసుపత్రుల్లో మార్చురీల ఆధునీకరణకు తెలంగాణ ప్రభుత్వం బుధవారం నాడు రూ.32.54 కోట్లు విడుదల చేసింది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ ” మనిషి బతికున్నప్పుడే కాదు మరణించిన తర్వాత కూడా తగిన గౌరవం అందించాలనే గొప్ప ఆలోచనతో పని చేస్తున్న మానవతామూర్తి సీఎం కేసీఆర్. పార్థివ దేహాలను నిల్వ చేసే మార్చురీల నుండి గౌరవంగా అంతిమసంస్కారం నిర్వహించే వైకుంఠదామాల వరకు అన్నీ గౌరవంగా సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా 61 ఆసుపత్రుల్లో మార్చురీల ఆధునికీకరణకు ప్రభుత్వం రూ. 32.54 కోట్లు విడుదల చేసింది. పార్థివ దేహాలను తరలించేందుకు మరో 16 వాహనాలను త్వరలో ప్రారంభించడంతో పాటు, మార్చురీల వద్ద వేచి ఉండే సంబంధిత కుటుంబ సభ్యుల కోసం అన్ని రకాల మౌలిక వసతులను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది” అని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ