తెలంగాణలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఇప్పటికే 66 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. ఈ స్థానంలో మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో బుధవారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు పక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. తుది ఫలితం వెల్లడయ్యేందుకు మరికొంత సమయం పట్టనుంది.
66 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ అనంతరం మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఓట్లు కలిపి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి 1,17,386 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 91,858 ఓట్లు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ కు 79,110 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 42,015 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ కు 30,358 ఓట్లు పోలయ్యాయి. దీంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్న కంటే 25,528 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ స్థానంలో విజయం సాధించాలంటే ఏ అభ్యర్ధికైనా మొత్తం 1,83,167 ఓట్లు రావాల్సి ఉంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యే కొద్దీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, ప్రొఫెసర్ కోదండరామ్ లలో ఈ స్థానాన్ని ఎవరు దక్కించుకుంటారనే ఉత్కంఠ ప్రజల్లో పెరుగుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ