తెలంగాణలో ముగ్గురు జిల్లా కలెక్టర్లు బదిలీ, ప్రభుత్వం ఉత్తర్వులు

Telangana: Khammam, Karimnagar, Mahabubabad Collectors Transferred

తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు జిల్లా కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఖమ్మం, మహబూబాబాద్, కరీంనగర్ జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు ఇచ్చింది. ఖమ్మం కలెక్టర్‌ గా విధులు నిర్వహిస్తున్న ఆర్‌.వి.కర్ణన్‌ ను కరీంనగర్‌ జిల్లాకు కలెక్టర్ గా బదిలీ చేశారు. కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ కె.శశాంకను జీఏడీలో రిపోర్డ్‌ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక మహబూబాబాద్‌ కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ కు ఖమ్మం జిల్లాకు కలెక్టర్ గా బాధ్యతలు అప్పగించారు. అలాగే ప్రస్తుతం మహబూబాబాద్‌ అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు)గా ఉన్న అభిలాష అభినవ్‌కు తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు కలెక్టర్‌ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తునట్టు పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ