కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ అమలు తీరును తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. బుధవారం నాడు నిర్మల్ పట్టణంలో లాక్‌డౌన్, ప్రభుత్వం సడలింపు ఏవిధంగా అమలవుతున్నాయో ఆయన అధికారులతో కలిసి పర్యవేక్షించారు. మంచిర్యాల చౌరస్తా, బస్ స్టాండ్, నారాయణ రెడ్డి మార్కెట్, బుధవార్ పెట్ చౌరస్తా, గాంధీ చౌక్, ఓల్డ్ మార్కెట్, ధ్యాగ వాడ, నగరేశ్వర్ వాడలో పర్యటించారు. వర్తకులు, చిరువ్యాపారులను కలిసి ప్రజలు నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ సమయంలో లాక్‌డౌన్ నియమాలు అమలు పరచటంలో భాగంగా, రోడ్లపై విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచిస్తూ, లాక్‌డౌన్ నియమాలు కఠినంగా అమలు చేయాలని తెలిపారు.
ప్రజలు అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని, ఒకవేళ తప్పనిసరిగా బయటకు రావాల్సి వస్తే చేతికి గ్లౌజులు ధరిస్తూ, ముఖానికి తప్పనిసరిగా మాస్క్ ను ధరించాలని, సామాజిక దూరం పాటిస్తూ, తమకు కావలసిన వస్తువులు తీసుకుని వెంటనే ఇంటికి వెళ్లిపోవాలని తెలుపుతూ, లాక్‌డౌన్ నియమాలు అమలు పరచడంలో పోలీస్ వారికి సహకరించవలసిందిగా కోరారు. అనంతరం నిర్మల్ పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను కూడా మంత్రి పరిశీలించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెంట మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, పోలీస్, ఇతర శాఖ అధికారులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ